Rain Alert : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నాలుగు రోజులు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Rain Alert : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నాలుగు రోజులు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

Rain Alert

Updated On : November 3, 2025 / 9:58 AM IST

Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరుస తుపానుల కారణంగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇటీవల మొంథా తుపాను కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. మొంథా తుపాను ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షం పడింది. దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో నిన్న సాయంత్రం, రాత్రి వేళల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ ఆదివారం రాత్రి వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా రహదారులు జలమయం అయ్యాయి.

ప్రస్తుతం తూర్పు విదర్భ, దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారినా దాని ప్రభావం వర్షాల రూపంలో తెలంగాణపై పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షా లు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

వర్షాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో గాలివానలు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే, వర్షాల ప్రభావం ఎక్కువగా యాదాద్రిభువనగిరి, నల్గొండ, సిద్ధిపేట జిల్లాల్లో ఉంటుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.