Minority Voters : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. మైనార్టీ ఓటర్ల ప్రభావం ఎంత?
Minority Voters Influence : ఏయే నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని మైనార్టీ ఓటర్లు డిసైడ్ చేయనున్నారు?

Minority Voters Influence
Minority Voters : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీ ఓటర్ల తీర్పు కీలకం కానుంది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే పాతబస్తీతో కలిపి 48 స్థానాల్లో మైనార్టీ ఓటర్ల తీర్పే విజేతలను నిర్ణయించనుంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్.. పోటాపోటీగా మైనార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇక, బీజేపీ కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ వ్యూహాలకు పదును పెడుతోంది.
రాష్ట్రంలో కీలకమైన నియోజకవర్గాల్లో ఓటర్ల నాడి ఎలా ఉంది? రాష్ట్రంలోని ఏయే నియోజకవర్గాల్లో మైనార్టీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు? ఏయే స్థానాల్లో మైనార్టీల ప్రభావం ఎక్కువగా ఉంది? ఆయా స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు? ఎక్కడెక్కడ అభ్యర్థుల భవితవ్యాన్ని మైనార్టీ ఓటర్లు డిసైడ్ చేయనున్నారు? ”మైనార్టీల్లో మెజార్టీ ఎవరిది?” ఈ రోజు బ్యాటిల్ ఫీల్డ్ లో స్పెషల్ డిస్కషన్..
”మైనార్టీల్లో మెజార్టీ ఎవరిది?”
* తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 50 నియోజకవర్గాల్లో మైనార్టీలు కీలక రోల్ పోషించే అవకాశం.
* పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో దాదాపు 50శాతం వరకు మైనార్టీ ఓటర్లే ఉన్నారు.
* ఆ ఏడు నియోజకవర్గాల్లోనూ ఎంఐఎం అభ్యర్థులే గెలుస్తున్నారు.
* ఏడుగురు ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
* ఆ ఏడు నియోజకవర్గాల్లో హిందువుల ఓట్లను పోలరైజ్ చేసే ప్రయత్నంలో బీజేపీ
* తెలంగాణలో మిగిలిన 41 నియోజకవర్గాల్లో 20వేలకు పైగా మైనార్టీ ఓటర్లు ఉన్నారు
* శేరిలింగంపల్లిలో 7లక్షల ఓటర్లు
* యావరేజ్ గా తీసుకున్నా ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 నుంచి 3లక్షల మంది ఓటర్లు ఉంటారు
* మైనార్టీల ఓట్లు కచ్చితంగా అభ్యర్థి గెలుపు ఓటములను ప్రభావితం చేయబోతున్నాయి
* 20వేలకు పైగా మైనార్టీ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు ఏవి?