Telangana Polls 2023 : ఫస్ట్ టైమ్ హోమ్ ఓటింగ్, 35వేల పోలింగ్ కేంద్రాలు- ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓ వికాస్ రాజ్

Vikas Raj : మొత్తం ఓటర్ల సంఖ్య 3కోట్ల 26లక్షలు. 2కోట్ల 81లక్షల ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తి. 114 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి.

Telangana Polls 2023 : ఫస్ట్ టైమ్ హోమ్ ఓటింగ్, 35వేల పోలింగ్ కేంద్రాలు- ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓ వికాస్ రాజ్

Telangana Assembly Elections 2023 (Photo : Google)

Updated On : November 23, 2023 / 6:02 PM IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. కొన్ని రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ కీలక వివరాలు వెల్లడించారు. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా పోలింగ్ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈసారి ఫస్ట్ టైం హోం ఓటింగ్ నిర్వహిస్తున్నాం అని వికాస్ రాజ్ తెలిపారు. మొత్తం ఓటర్ల సంఖ్య 3కోట్ల 26లక్షల మందిగా వెల్లడించారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారని చెప్పారు. 9లక్షలకు పైగా యంగ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు.

Also Read : కేసీఆర్‭కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం కట్టిస్తా.. రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

”పోస్టల్ బ్యాలెట్ 4 లక్షలు, EVM బ్యాలెట్లు 8లక్షల 84వేలు ప్రింట్ అయ్యాయి. ఎపిక్ కార్డులు 51 లక్షలు ప్రింట్ అయ్యి దాదాపు పంపిణీ అయ్యాయి. ముగ్గురు స్పెషల్ అబ్జర్వర్లు వచ్చారు. ప్రతి కౌంటింగ్ సెంటర్ కు ఒక అబ్జర్వర్ ఉంటారు. మూడు కేటగిరీలలో హోం ఓటింగ్ జరుగుతుంది. 9వేల 300 మంది 80ఏళ్లు పైబడిన వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2కోట్ల 81లక్షల ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తైంది. ఎల్లుండికి ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తవుతుంది. పోలింగ్ కేంద్రాల సంఖ్య 35వేల 655. 59 వేల బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నాము. రేపటి వరకు కమీషనింగ్ పూర్తవుతుంది. తెలంగాణలో శాంతి భద్రతల సమస్య లేదు. 114 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి.

Also Read : సనాతన ధర్మం, సోషలిజం రెండు కలిసి నడిచేదే జనసేన : పవన్ కల్యాణ్

అభ్యర్థుల సంఖ్య పెరగడం వల్ల కొన్ని చోట్ల రెండు, మూడు, నాలుగు కూడా బ్యాలెట్ బాక్సులు వాడుతున్నాం. ఇప్పటివరకు పొలిటికల్ పార్టీలకు 37వేల వరకు అనుమతులు ఇచ్చాము. C విజిల్ యాప్ ద్వారా 6వేల 600 ఫిర్యాదులు అందాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ వెహికిల్ కు జీపీఎస్ ఉంటుంది. ప్రతి సెగ్మెంట్ కు మూడు SST, ఫ్లయింగ్ స్క్వాడ్ లు. ఇప్పటివరకు పట్టబడిన సొమ్ము 669 కోట్లు. అర్బన్ ఏరియాల్లో ఓటింగ్ శాతం గతంలో తక్కువగా ఉంది. 3లక్షల మంది పోలింగ్ ప్రిపరేషన్ లో పాల్గొంటున్నారు. 64వేల మంది రాష్ట్ర పోలీసులు, 375 కేంద్ర కంపెనీల నుంచి బలగాలు రానున్నాయి.