Bandi Sanjay: అందుకే కేటీఆర్ అరెస్టు కథ కంచికి చేరింది: బండి సంజయ్
కేటీఆర్‌ను అరెస్ట్ చేయకపోవడం సర్కార్ చేతగానితనమేనని బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay
ఢిల్లీలో సెటిల్మెంట్ జరిగిందని, ఇక కేటీఆర్ అరెస్ట్ కథ కంచికేనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సంగారెడ్డిలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కాం కేసులన్నీ గాలికేనని చెప్పారు. కలెక్టర్ పై దాడి సూత్రధారి కేటీఆర్ అని తేలినా అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌ను అరెస్ట్ చేయకపోవడం సర్కార్ చేతగానితనమేనని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తోంది కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నయని చెప్పారు. ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని, కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా అని సవాలు విసిరారు.
తనకు, రేవంత్ రెడ్డికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకే దాడులు తెరపైకి తీసుకొస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని, దాడులతో, ప్రజల ప్రాణాలాతో చెలగాటాలాడుతోందని తెలిపారు.
గ్రూప్ 1, కానిస్టేబుల్ ఆందోళనలోనూ బీఆర్ఎస్ విధ్వంసం చేయాలనుకుందని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను నిషేధించాలని రాష్ట్ర ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. తాను కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నానని, రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాలు లేవని తెలిపారు.
Pawan Kalyan: ఏపీలో వైసీపీని మామూలుగా కొట్టలేదు: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్