హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి డేట్స్‌ ఫిక్స్‌.. రెడీగా ఉండండి..

ఉబ్బసం వ్యాధిగ్రస్థులు చేప ప్రసాదం కోసం భారీగా తరలివస్తారు.

హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి డేట్స్‌ ఫిక్స్‌.. రెడీగా ఉండండి..

Fish Prasadam

Updated On : May 6, 2025 / 11:36 AM IST

మృగశిర కార్తెను పురస్కరించుకుని ప్రతి ఏటా హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో బత్తిని కుటుంబ సభ్యులు చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ సారి మే 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతుంది.

ఉబ్బసం వ్యాధిగ్రస్థులు చేప ప్రసాదం కోసం భారీగా తరలివస్తారు. బత్తిని కుటుంబ సభ్యులు 179 ఏళ్లుగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ సారి చేప మందు పంపిణీ కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు ఇప్పటికే హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌కు నెలలో బత్తిని కుటుంబ సభ్యులు లెటర్ పంపారు.

Also Read: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

చేప ప్రసాదాన్ని ప్రతిఏటా 5 లక్షల మందికిపైగా తీసుకుంటారు. బత్తిన విశ్వనాథ్ గౌడ్ సమక్షంలో చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. చేపమందు కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రజలు వస్తారు. గత ఏడాది 55,440 మంది చేప ప్రసాదం తీసుకున్నారు.