Batukamma sarees : Dussehra పండగ సారె, 287 రకాల డిజైన్లు, కోటి చీరెలు

Dussehra Festival : తెలంగాణ ప్రభుత్వం తరపున ఆడబిడ్డలకు పండగ సారె సిద్ధమైంది. బతుకమ్మ (Batukamma) చీరల పంపిణీకి టెస్కో (Tesco) అన్ని ఏర్పాట్లు చేసింది . అక్టోబర్ 9 నుంచి అన్ని జిల్లాల్లో సారీస్‌ను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు అధికారులు. 99 లక్షల మంది పేదింటి మహిళలకు చీరలు అందనున్నాయి.
తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ. ఆడబిడ్డలు గొప్పగా జరుపుకునే పూల జాతర. అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం ప్రతీ ఏటా మహిళలకు చీరలు పంచుతుంది. ఓ వైపు నేతన్నలకు ఉపాధి కల్పిస్తూ.. మరోవైపు పేద మహిళలకు పండగ రోజు చీరె అందిస్తుంది ప్రభుత్వం.
బతుకమ్మ చీరల ద్వారా పవర్ లూమ్స్‌కు చేతి నిండా పని దొరుకుతుందన్నారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వం ఒక్క బతుకమ్మ చీరలకే 2017నుంచి ఇప్పటివరకు వెయ్యి 33 కోట్లు ఖర్చు పెట్టింది. అక్టోబర్ 9 నుంచి చీరలను పంచేందుకు సర్కార్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలకు 80శాతం చీరెలను తరలించారు అధికారులు. మరో పది రోజుల్లో మిగతా 20శాతం చీరలు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కరోనా (Corona) కేసులు ఎక్కువగా ఉన్న చోట చీరలను డోర్ డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ (Batukamma) చీరలు కట్టుకుంటున్న మహిళల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని.. ఈ ఏడాది కొత్త డిజైన్స్.. కలర్స్‌తో సారీస్ తయారు చేసింది టెస్కో. ఈసారి 287 రకాల వెరైటీ డిజైన్లతో కోటి చీరెలను తయారు చేసింది.
వెండి, బంగారు జెరీలతో సారీస్ తయారు చేశామన్నారు టెస్కో ఎండీ శైలజా రామయ్యర్. చీరల క్వాలిటీ విషయంలో టెస్కో పలు జాగ్రత్తలు తీసుకుంది. గ్రామీణ, పట్టణ మహిళలు మెచ్చేలా సారీస్‌ను డిజైన్ చేసింది. అటు కరోనా నిబంధనలను పాటిస్తూ చీరలను పంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.