Kasani Gnaneshwar: ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడాన్ని మానేస్తే బాగుంటుంది: టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని విమర్శించే వారు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడాన్ని మానేస్తే బాగుంటుందంటూ టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చురకలంటించారు. బియ్యం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను వక్రీకరించవద్దని చెప్పారు. దొడ్డు వడ్లు, గకుట తినే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్టీఆర్ పాలన మొదలైందని అన్నారు. గటుకు, గంజి తాగి తాము పెరిగామని తెలిపారు.

Kasani Gnaneshwar
Kasani Gnaneshwar: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని విమర్శించే వారు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడాన్ని మానేస్తే బాగుంటుందంటూ టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చురకలంటించారు. బియ్యం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను వక్రీకరించవద్దని చెప్పారు. దొడ్డు వడ్లు, గకుట తినే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్టీఆర్ పాలన మొదలైందని అన్నారు. గటుకు, గంజి తాగి తాము పెరిగామని తెలిపారు.
గటుకు తినే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి కడుపునిండా అన్నం పెట్టారని కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. ధమ్ కా బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో నిరంజన్ రెడ్డి చెప్పాలి? అని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఎవరి పాలనలో అన్యాయం జరిగిందో ప్రజలకు తెలుసని చెప్పారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు ఎందుకు ఇవ్వడం లేదు? అని నిలదీశారు.
తాము ప్రజలకు చేసిన అభివృద్ధి చెప్పుకుంటున్నామని, అటువంటప్పుడు కొందరికి ఎందుకు బాధ? అని కాసాని జ్ఞానేశ్వర్ ప్రశ్నించారు. నిరంజన్ రెడ్డి ఏరియా నుంచి వలసలు ఆగాయా? అని నిలదీశారు. వలసలు ఇంకా పోతున్నారని చెప్పారు. నిరంజన్ రెడ్డి స్క్రిప్ట్ చదువడాన్ని మానుకోవాలని,ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. చంద్రబాబు ఒక్క మీటింగ్ పెడితే బీఆర్ఎస్ ఎందుకు భయపడుతోంది? అని నిలదీశారు.
టీడీపీ ఇంటింటికీ వెళ్తుందని అనగానే గడీల రాజ్యం పునాదులు కదులుతాయని వణుకు పుడుతోందని కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. టీడీపీకి పూర్వవైభవం వస్తే తమ నాయకులకు పుట్ట గతులు ఉండవని బీఆర్ఎస్ భావిస్తోందని అన్నారు. ఎన్టీఆర్ పాలనకు ముందు దొరలకు కూడా తినేందుకు సన్న బియ్యం దొరకలేదని తెలిపారు. ఆహార భద్రత అనేది టీడీపీ వచ్చిన తరువాతే లభించిందనేది వాస్తవమని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని, దానిపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. అబద్ధాలు చెప్పినా అతికినట్లు ఉండాలని చెప్పారు. నిరంజన్ రెడ్డితో సూటిగా డిబేట్ కు సిద్ధమని అన్నారు.
Fire Accident : రేణిగుంట ఫాక్సీలింక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. ఎయిర్ పోర్టు సమీపంలోనే ఘటన