Bhatti Vikramarka Mallu : ముసలి నక్క అంటావా? నేను కూడా అలా మాట్లాడితే తట్టుకోలేవు- మంత్రి కేటీఆర్‌కు భట్టి వార్నింగ్
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కేటీఆర్, కేసీఆర్, హరీశ్ రావుకి ప్రజలు బుద్ధి చెబుతారు. Bhatti Vikramarka Mallu

Bhatti Vikramarka Mallu Slams KTR (Photo : Google)
Bhatti Vikramarka Mallu – KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని ముసలి నక్క అని కేటీఆర్ సంభోదించడంపై భట్టి విక్రమార్క తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ భాషను ఆయన తప్పుపట్టారు. ఇదే భాష? అని ధ్వజమెత్తారు. ఖమ్మంలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు.
నీకు ఎందుకంత భయం?
” కేటీఆర్ చదువుకున్నాడు, ప్రపంచ జ్ఞానం ఉందని అనుకున్నా. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి.. వారెంటీ లేదు గ్యారెంటీ లేదు.. కాంగ్రెస్ పార్టీ ముసలి నక్క అంటూ కేటీఆర్ మాట్లాడటం దారుణం. అసలు అదేమి భాష? నువ్వు వచ్చావు. ఏం చేస్తావో చెప్పుకోవాలి. అంతేకానీ ఇదేమిటి? జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేయించారు. ఎందుకంత భయం? ఇదెక్కడి న్యాయం? నీకంటే ఎక్కువ భాష మాట్లాడగలను. కానీ, నాకు సభ్యత, సంస్కారం అడ్డు వస్తుంది.
దేశం సుభిక్షంగా ఉందంటే కారణం కాంగ్రెస్..
ఒక బహుళార్ధక పరిశ్రమ, ప్రాజెక్టు, ట్రిపుల్ ఐటీ తెచ్చావా? మేం పాలన చేశాం కాబట్టి ఆ రోడ్డు మీద రాగలిగావు. పదేళ్లలో తట్టెడు మట్టి పోయలేదు. నువ్వు సూట్ వేసుకుని సిలికాన్ లో తిరుగుతున్నావ్ అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనే. భూములు పంచింది కాంగ్రెస్. దేశం సుభిక్షంగా ఉందంటే కారణం కాంగ్రెస్. మైక్ పెట్టి అడ్డగోలుగా మాట్లాడటం కాదు. మేము కూడా అలానే చేస్తే మీరు పుట్టే వాళ్లు కాదు. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఉండాలి. ప్రజలు ఇచ్చే దరఖాస్తు తీసుకునే ధైర్యం నీకు లేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.
80 సీట్లు మావే..
ఇకపై అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 75 నుంచి 80 సీట్లు కాంగ్రెస్ కి ఇవ్వబోతున్నారు. ఆరు గ్యారెంటీలు ప్రకటించాం. వంద రోజుల్లో అమలు చేస్తాం. ప్రజలకు చెందకుండా మీరు కుట్ర చేస్తున్నారు. మేం ప్రకటించాం. బాగా లేకపోతే లేవని చెప్పు. మీ బాధ ఏమిటి? మీ నలుగురి కోసం కాదు. ప్రజల కోసం పెట్టాం.
ప్రజలు గొర్రెలు కాదు..
రేపు జరగబోయే ఎన్నికల్లో ఓట్లు కాంగ్రెస్ కి వేస్తారు. మీ బెదిరింపులకు భయపడరు. తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు చాలా తెలివైన వారు. తెలంగాణ పోరాట యోధులు. కేటీఆర్, కేసీఆర్, హరీశ్ రావుకి ప్రజలు బుద్ధి చెబుతారు. కేటీఆర్ మొత్తం పార్టీ గింత ఉంటుంది. మాది జాతీయ పార్టీ. అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. మీ నాయన, నువ్వు ప్రగతి భవన్ లో మాట్లాడుకుని ప్రజలకు చెబుతున్నారు. మీలా కాదు మా పార్టీ. 2004 నుండి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. కేటీఆర్ నువ్వు చదువు కోలేదా? చదువుకుంటే తెలుస్తుంది. బీఆర్ఎస్ కి పట్టుమని పదేళ్ళు కాలేదు. మీ వారంటీ, గ్యారంటీ అయిపోయాయి” అని భట్టి విక్రమార్క అన్నారు.