Manikrao Thakare : షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం, బీజేపీ కీలక నేతలు టచ్‌లో ఉన్నారు- కాంగ్రెస్ ఇంచార్జి హాట్ కామెంట్స్
Manikrao Thakare :

Manikrao Thakare (Photo : Twitter, Google)
Manikrao Thakare – YS Sharmila : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం ఉందన్నారాయన. అయితే, అది తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పారు మాణిక్ రావు ఠాక్రే. వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ అధిష్టానం టచ్ లో ఉందని ఆయన వెల్లడించారు.
” అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తాం. రెండు విడతలుగా అభ్యర్థుల ప్రకటన చేయాలనుకుంటున్నాం. షర్మిలతో కాంగ్రెస్ అధిష్టానం టచ్ లో ఉంది. షర్మిల వల్ల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం ఉంది. తెలంగాణలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు.
Also Read..Etala Rajender : బీజేపీలో ఈటల మౌనం, అనుచరులతో సమావేశం.. పార్టీ మారతారంటూ ప్రచారం
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పార్టీ కోసం చాలా గట్టిగా పోరాడుతున్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర పార్టీకి చాలా దోహదం చేస్తుంది. వాహనం ఎక్కకుండా భట్టి 100 రోజులుగా వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
ప్రియాంక గాంధీ తెలంగాణపై చాలా ఫోకస్ చేస్తారు. తెలంగాణ వ్యవహారాలకు సంబంధించి రెండు మూడు రోజుల్లోనే ప్రియాంక గాంధీ పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధమవుతుంది. బీజేపీ నుండి కీలక నేతలు మా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటే అని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు.