Kadiyam Kavya : వరంగల్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య?

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Kadiyam Kavya : వరంగల్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య?

Kadiyam Kavya Big Shock For Brs

Kadiyam Kavya : లోక్ సభ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు లీడర్లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. కొందరు అధికార కాంగ్రెస్ లో చేరితే, మరికొందరు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇంకా కొందరు నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నారు. తాజాగా వరంగల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. కడియం శ్రీహరి, కడియం కావ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారు.

వరంగల్ లోక్ సభ పోటీ నుండి తప్పుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య. తాను పోటీ చేయడం లేదంటూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారామె. బీఆర్ఎస్ పై అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో వివరించారు కడియం కావ్య. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నట్లు లేఖలో తెలిపారు కావ్య. కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మన్నించాలని కావ్య కోరారు.

కాగా, కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే వారిద్దరూ ఢిల్లీకి వెళ్లినట్టు జిల్లాలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. కాగా.. కడియం శ్రీహరి తీరు.. అవకాశాన్ని అందిపుచ్చుకునే వ్యవహారంగానే చూడాలి. టీడీపీలో ఉన్నప్పుడు ఇదే రాజకీయ పరిణామాలు ఎదురైనప్పుడు కూడా కడియం శ్రీహరి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం కడియం శ్రీహరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీడీపీ లాబీ (రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సీతక్క..) చాలా బలంగా పని చేసిందని చెప్పొచ్చు.

Also Read : కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను తనిఖీ చేయండి, ఆస్తుల వివరాలు బయటపెట్టండి- డీజీపీకి ఫిర్యాదు