పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లను కూల్చివేస్తే.. రెండు గంటల్లో దారూసలెంను కూల్చివేస్తాం : బండి సంజయ్

  • Published By: bheemraj ,Published On : November 25, 2020 / 06:40 PM IST
పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లను కూల్చివేస్తే.. రెండు గంటల్లో దారూసలెంను కూల్చివేస్తాం : బండి సంజయ్

Updated On : November 25, 2020 / 7:25 PM IST

Bandi Sanjay serious Akbaruddin comments : ఎంఐఎం, బీజేపీ మాటల యుద్ధంతో గ్రేటర్ లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని పీవీ నర్సింహ్మారావు, ఎన్టీఆర్ ఘాట్ లను కూల్చాలన్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకవేళ పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లను కూల్చివేస్తే తాము రెండు గంటల్లో దారూసలెంను కూల్చివేస్తామని హెచ్చరించారు.



రేపు ఉదయం పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లకు వెళ్తానని సంజయ్ చెప్పారు. అక్కడికి వెళ్లి మహానాయకుల ఘాట్లకు తాను రక్షణగా ఉంటానని చెప్పారు. ఒకవేళ పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను తొలగించే, కూల్చివేసే ప్రయత్నం చేస్తే రెండు గంటల్లో దారూసలేంను కూల్చివేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను సందర్శించాలని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. నేతలు, కార్యకర్తలతో బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.



బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ కు సంబంధించి పోటాపోటీ కామెంట్స్ చేసుకుంటున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో రాజకీయాలు హీటెక్కాయి. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారు చుట్టూ తిరిగిన రాజకీయాలు ఒక్కసారిగా పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల చుట్టూ తిరిగే పరిస్ధితి రాబోతుంది.