Dk Aruna: వైఎస్ఆర్, చంద్రబాబు.. బెస్ట్ సీఎం ఎవరు? గోల్డెన్ పీరియడ్ ఏది? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..

ఆయన పలకరించే విధానం కానీ, మాట్లాడే తీరు కానీ, పాలన పరంగా, మంత్రులు ఎమ్మెల్యేలకు ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్.. అన్నింటి పరంగా..

Dk Aruna: వైఎస్ఆర్, చంద్రబాబు.. బెస్ట్ సీఎం ఎవరు? గోల్డెన్ పీరియడ్ ఏది? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..

Updated On : November 16, 2025 / 9:14 PM IST

Dk Aruna: గతంలో కేసీఆర్, అంతకముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, చంద్రబాబు, ఇప్పుడు రేవంత్ రెడ్డి.. ఇలా చాలా మంది ముఖ్యమంత్రులను మీరు చాలా దగ్గరి నుంచి రాజకీయ నాయకురాలిగా గమనిస్తూ వచ్చారు. వారిలో బెస్ట్ ఎవరు? వరస్ట్ ఎవరు? అంటే ఏం చెబుతారు..

”ఎవరి ప్రత్యేకతలు వారివే. ఒకరు బెస్ట్ అని మరొకరు తక్కువనో చెప్పడం కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. లీడర్ అంటే అలా ఉండాలి అనిపించేలా ఉంటారు. ఆయన నుంచి మేము చాలా నేర్చుకున్నాం. లీడర్ అంటే ఎలా ఉండాలి. ఏ విధంగా ప్రజల మనసులు గెలవాలి. ఆయన నుంచి మేము చాలా నేర్చుకున్నాం. లీడర్ అనేటువంటి వ్యక్తి ఎవరిలోనైనా చూశామంటే.. అది వైఎస్ఆర్ లోనే చూశాం. ఆయనను చూడగానే.. ద లీడర్ అనిపిస్తుంది. ఆయన పలకరించే విధానం కానీ, మాట్లాడే తీరు కానీ, పాలన పరంగా, మంత్రులు ఎమ్మెల్యేలకు ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్.. అన్నింటి పరంగా.. ఏ విధమైన కార్యక్రమాలు చేసి ప్రజలకు దగ్గరవ్వాలి.. ఇలా అన్ని అంశాల్లో ఆయన డిఫరెంట్ గా పరిపాలించారు. అందరి మనసుల్లో ఆయన పరిపాలన ముద్ర వేసింది. అది గోల్డెన్ పీరియడ్ అని అనుకుంటాం అందరం కూడా.

చంద్రబాబుకి ఒక ఇమేజ్ ఉంది. ఆయనకు ఒక విజన్ ఉంది. విజన్ ఉన్న లీడర్ గా ఆయనకున్న ఐడెంటిటీ ఆయనకుంది. ఒక్కొక్కరికి ఒక్కో ఐడెంటీ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి మాస్ లీడర్ కాదు.. బట్ పరిపాలన పరంగా చాలా వర్క్ చేసేవారు. పరిపాలన పరంగా చాలా లోతుగా స్టడీ చేసి పని చేసేవారు. ఆయన ఐడెంటిటీ ఆయనకుంది. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో ఐడెంటిటీ. ఆయన బాగున్నాడు, ఈయన బాగోలేడు అని చెప్పలేము. ఏది ఏమైనా రాజశేఖర్ రెడ్డి పీరియడ్ గోల్డెన్ పీరియడ్ అని చెప్పక తప్పదు” అని డీకే అరుణ స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఏంటి? అధికారంలోకి వస్తుందా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో ఎంపీ డీకే అరుణ..