Brinda Karat: ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి: బృందా కారత్
ఆర్ఎస్ఎస్, బీజేపీలు తమ స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని, ప్రజలను వారు తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు

Brinda
Brinda Karat: దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీలు తమ స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని, ప్రజలను వారు తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. ఇటీవల మృతి చెందిన తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపై నివాళి అర్పించేందుకు మంగళవారం బృంద కారత్ నల్లగొండ వచ్చారు. ఈసందర్భంగా మల్లు స్వరాజ్యం పోరాటపటిమను గుర్తుచేసుకున్న బృందా కారత్ సాయుధ పోరాట వీరనారి, పేద ప్రజల కోసం చివరి వరకు తపించిన మల్లు స్వరాజ్యం మరణం బాధాకరం అన్నారు. ప్రజల మనసుల్లో మల్లు స్వరాజ్యం చిరస్థాయిగా నిలిచిపోయారని ఆమె పేర్కొన్నారు.
Also read: Delhi Crime : పసిబిడ్డను మైక్రోఓవెన్‌లో పెట్టి చంపిన తల్లి..!!
అనంతరం బృందా కారత్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం పైనా విమర్శలు గుప్పించారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో వాస్తవాలు పూర్తి స్థాయిలో చూపించలేదని ఆమె అన్నారు. గతంలో కాశ్మీర్ పండిట్లు తీవ్రమైన అణచివేతకు గురయ్యారనడంలో ఎటువంటి లేదని.. దేశంలో ఎవరూ ఎదుర్కోని హింసను, మారణకాండను వారు ఎదుర్కొన్నారని బృందా కారత్ పేర్కొన్నారు. అయితే ఉగ్రవాదుల చేతిలో కశ్మీర్ పండిట్లు మాత్రమే హింసకు గురికాలేదని.. మొత్తం కాశ్మీరీలు హింసకు గురయ్యారని ఆమె అన్నారు. కాశ్మీరీలంటే వారిలో హిందూ పండిట్లతో పాటు..ముస్లింలు, ఇతర వర్గాల వారు కూడా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
Also Read:Akhilesh Yadav : లోక్‌సభ ఎంపీగా అఖిలేశ్ యాదవ్ రాజీనామా
కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తు, తమ స్వార్ధ రాజకీయాలు కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని బృందా కారత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ పార్టీ(సీపీఎం) ఎమ్మెల్యే యూసఫ్ తరిగామి కుటుంభంలో ఇద్దర్ని ఉగ్రవాదులు బలితీసుకున్నారని.. ఎంతో మంది ముస్లిం లీడర్లను ఉగ్రవాదులు కాల్చి చంపారని.. అవన్నీ మరుగునపడేస్తూ కేవలం ఒక వర్గానికి మాత్రమే నష్టం జరిగినట్లుగా ప్రచారం చేయడం తగదని బృందా కారత్ అభిప్రాయపడ్డారు. స్వార్ధ రాజకీయాల కోసం బీజేపీ ప్రభుత్వం కూడా ఆసినిమాను ప్రోత్సహించడం బాధాకరమని ఆమె అన్నారు.
Also read: Pakistan : పాకిస్థాన్‌లో 18 ఏళ్ల హిందూ యువతి కాల్చివేత..
కాశ్మీరీలపై హింస, గుజరాత్ మారణహోమం, సిక్కుల ఊచకోత వంటి అంశాలను దేనికవే ప్రత్యేకంగా చూడాలని..ఒకటి తక్కువ మరొకటి ఎక్కువ అని చూడొద్దని బృందా కారత్ అన్నారు. గుజరాత్ మారణహోమ బాధితులకు నేటికీ న్యాయం జరగలేదని ఆమె తెలిపారు. బీజేపీ ఇప్పటికే కాశ్మీర్ సమస్యను మరింత జటిలం చేసిందని..ఇప్పుడు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చేందుకు దేశ వ్యాప్తంగా తప్పుడు ప్రచారానికి దిగిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు.
Also Read:Gas Cylinder : గ్యాస్ మంటలు – రూ. 50 పెరిగిన సిలిండర్ ధర