Motukupalli Narasimhulu : బీజేపీ నేత మోత్కుపల్లి ఆరోగ్య పరిస్ధితి విషమం

మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్ధితి విషమించింది. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయన హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు.

Motukupalli Narasimhulu : బీజేపీ నేత మోత్కుపల్లి ఆరోగ్య పరిస్ధితి విషమం

Motukupalli Narasimhulu

Updated On : April 18, 2021 / 1:44 PM IST

Motukupalli Narasimhulu Health condition is critical :  తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇలా అందరూ సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్ధితి విషమించింది. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయన హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు.

శనివారం రాత్రి శ్వాస తీసుకోవటం లో ఇబ్బంది రావడంతో ఆయన్ను వెంటనే సోమాజీగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మోత్కుపల్లికి ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు.కాగా… ఆదివారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు తెలిపారు. మోత్కుపల్లిని పరామర్శించేందుకు పలువురు నేతలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మోత్కుపల్లి మంత్రిగా పనిచేసారు. రాష్ట్ర విభజన అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయన విభేదించారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

తెలంగాణ లో టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ఎన్‌టీఆర్‌ ఘాట్‌ వద్ద సంచలన ప్రకటన చేసి టీడీపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బీజేపీలో చేరారు. కాగా… నిన్న తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 5,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.