Eatala Rajender: ఈటల ఫ్లెక్సీ కేసులో బిగ్ ట్విస్ట్.. సొంతపార్టీ నేతలే కుట్ర.. నిందితుల అరెస్ట్.. A1 గా జన్యావుల రామకృష్ణ
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajender)ను టార్గెట్ చేస్తూ వెలిసిన ఫ్లెక్సీల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపింది.
bjp shock twist bjp leader ramakrishna arrested for anti eatala rajender poster
- ఈటల ఫ్లెక్సీల కేసులో తీవ్ర సంచలనం.
- సొంతపార్టీ లీడర్లే కుట్ర చేసినట్లు గుర్తింపు.
- ఏ1 రామకృష్ణపై బీజేపీ సస్పెన్షన్ వేటు.
Eatala Rajender: తెలంగాణ బీజేపీలో అంతర్గత విబేధాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajender)ను టార్గెట్ చేస్తూ నగరంలోని పలు ప్రాంతాల్లో వెలిసిన వివాదాస్పద ఫ్లెక్సీల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపింది. ‘ఈటల ఏడుపే బీజేపీకి శాపం’ అంటూ సంచలన వ్యాఖ్యలతో వెలిసిన ఈ ఫ్లెక్సీల వెనుక ఇతర పార్టీల కుట్ర ఉందంటూ తొలుత ప్రచారం జరిగినప్పటికీ, పోలీసుల లోతైన విచారణలో అసలు నిజాలు బయటపడటంతో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. సొంత పార్టీ నేతలే ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులని తేలడంతో ఉలిక్కిపడటం గులాబీ కోటను దాటి కమలం గూటికి చేరింది.
Harish Rao: కవిత పార్టీ గురించి అనవసరం.. నేనే టార్గెట్ ఎందుకు అయ్యాను.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కూకట్పల్లి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్, బీజేపీ ముఖ్య నాయకుడు జన్యావుల రామకృష్ణనే (A1) ఈ వివాదాస్పద ఫ్లెక్సీలను పెట్టించినట్లు పోలీసులు నిర్ధారించారు. రామకృష్ణతో పాటు ఆయన పీఏ గాజుల రాకేష్ (A2), సయ్యద్ కుద్రుత్ అహ్మద్ (A3), సయ్యద్ మెహ్రాజ్ (A4), షేక్ కలీం (A5), నజీర్ ఉద్దీన్ (A6)లను ఈ కేసులో నిందితులుగా చేర్చి వారిపై కేసులు నమోదు చేశారు.
ఈ పరిణామాలపై తెలంగాణ బీజేపీ నయా బాస్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అత్యంత కఠినంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, తోటి సీనియర్ నాయకుడిపై బహిరంగంగా దుష్ప్రచారం చేసినందుకు గానూ జన్యావుల రామకృష్ణను బీజేపీ నుండి తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ ఎదుగుదలను దెబ్బతీసేలా మరియు నాయకుల మధ్య విభేదాలు సృష్టించేలా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదని రాష్ట్ర నాయకత్వం ఈ చర్య ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపింది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీల వివాదం, ఆపై సొంత పార్టీ నేతపైనే సస్పెన్షన్ వేటు పడటం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
