Bandi Sanjay : తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు-బండి సంజయ్

ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చెప్పారు. జూబ్లీ హిల్స్ లో  మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో దోషులను శిక్షించే వరకు బిజెపి ఉద్యమిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Bandi Sanjay : తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు-బండి సంజయ్

Bandi Snajay Kumar

Updated On : June 7, 2022 / 4:32 PM IST

Bandi Sanjay :  ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చెప్పారు. జూబ్లీ హిల్స్ లో  మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో దోషులను శిక్షించే వరకు బిజెపి ఉద్యమిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

సామూహిక అత్యాచారం ఘటనలో నేరం చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయని పోలీసులు…. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న బీజేపీ నాయకులు… కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు పెట్టడం బాధాకరమని అన్నారు.

ఈ అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను అరెస్ట్ చేయడంలో ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నాయకుల, కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపుతున్న ఉత్సాహం దోషులను అరెస్ట్ చేయడం పట్ల చూపితే న్యాయం జరిగేదని ఆయన అన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.

ఈ తరహా అత్యాచార ఘటనలు రోజుకో కొత్త కేసు వెలుగు చూడడం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శననమని ఆయన అన్నారు. ఇది ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకానితనమే అని… నేరాలను అరికట్టడంలో మేమే నెంబర్ 1 అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ గొంతు ఎందుకు మూగబోయిందని బండి సంజయ్ ప్రశ్నించారు. రోజుకొక అత్యాచార ఘటన వెలుగు చూస్తున్ననేపధ్యంలోవారు స్పందించాలని బండి సంజయ్ కోరారు.

Also Read : Lovers Suicide : విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం