Kcr On Phone Tapping : ఫోన్ ట్యాపింగ్‌పై ఎట్టకేలకు స్పందించిన కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజానిజాలు బయటపెడతాను అని కామెంట్ చేశారు.

Kcr On Phone Tapping Row
Kcr On Phone Tapping : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేసీఆర్ ఎట్టకేలకు స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తానని కేసీఆర్ వెల్లడించారు. పదేళ్ల పాటు సీఎంగా ఉన్నాను అన్న కేసీఆర్, కచ్చితంగా క్లారిటీ ఇస్తానని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజానిజాలు బయటపెడతాను అని కామెంట్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రతిపక్షంలో ఉన్న నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ సాగిస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతలపైనా ఆరోపణలు వస్తున్నాయి. వారి ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంటున్నారు.
బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు. రెండు మూడు రోజల్లో దీనిపై స్పష్టత ఇస్తానని కేసీఆర్ చెప్పారు. అంతేకాదు నిజానిజాలు బయటపెడతానని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందా? లేదా? అన్నది కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : ఏపీలోని 5 విలీన గ్రామాలను తెలంగాణలో తిరిగి కలుపుతాం: కాంగ్రెస్