మూసీ పేరిట ప్రభుత్వం దోపిడీ చేసే యత్నం చేస్తోంది : కేటీఆర్
మాకు అప్పు పుట్టడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. రాష్ట్ర ప్రతిష్ట దిగజారేలా వ్యవహరిస్తే అప్పులు ఎలా వస్తాయని కేటీఆర్ ప్రశ్నించారు.

KTR
KTR : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. గ్రేటర్ లో ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తోందని, మూసీ సుందరీకరణపై ప్రభుత్వం రోజుకో మాట చెబతోందని అన్నారు. అన్ని అనుమతులు ఉన్నా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ బీఆర్ఎస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్, గ్రేటర్ బీఆర్ఎస్ ముఖ్యనేతలు హాజరయ్యారు. మూసీ, హైడ్రా ప్రాజెక్టుల భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూసి పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేసే యత్నం చేస్తోంది.. హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తుందని విమర్శించారు. 40ఏళ్లుగా ఉంటున్న వారి ఇళ్లు కూలగొడతామని అంటున్నారు. బిల్డర్లను బెదిరించేందుకు, వసూళ్ల కోసమే హైడ్రా పేరుతో డ్రామా అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Also Read: బండ్ల గణేశ్‌తో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దేవిశ్రీ ప్రసాద్
మూసీకి శుద్ధ జలాలు అందించాలంటే జంట జలాశయాలను గోదావరి జలాలతో నింపాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని కేటీఆర్ గుర్తు చేశారు. సుందరీకరణ పేరుతో పేదలను ఇబ్బందులు పెట్టరాదని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందని, హైదరాబాద్ బస్తీ వాసులకు అండగా ఉండాలని నిర్ణయించినట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో సమిష్టిగా పర్యటనలు మొదలు పెడతామని, అన్ని నియోజకవర్గాల్లో బస్తీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. 440కి పైగా కుటుంబాల వారు మా పార్టీ కార్యాలయానికి వచ్చి మొర పెట్టుకున్నారు. హైడ్రా వల్ల భయానక వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, ఎంఐఎంలు అక్రమ వసూళ్ల వ్యవహారంలో నిమగ్నమయ్యాయని కేటీఆర్ విమర్శించారు.
Also Read: Chennai Rain: చెన్నైలో భారీ వర్షాలు.. రజనీకాంత్ ఇంటి చుట్టూ భారీగా చేరిన వరదనీరు.. వీడియో వైరల్
మాకు అప్పు పుట్టడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. రాష్ట్ర ప్రతిష్ట దిగజారేలా వ్యవహరిస్తే అప్పులు ఎలా వస్తాయని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం మాటలు చూస్తే ఆయన బీజేపీలో ఉన్నారని అనిపించింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజల మధ్య సమావేశాలు పెట్టాలి. మేముకూడా అఖిల పక్ష సమావేశం పెడతాం. అసమర్ధుడి జీవన యాత్రలా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.