ఒకరేమో ఆటోలో, మరొకరేమో బస్సులో అసెంబ్లీకి.. ఎందుకో తెలుసా?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలు జరుగుతోన్న వేళ ఓ కాంగ్రెస్ నేత బస్సులో అక్కడకు చేరుకోగా, ఓ బీఆర్ఎస్ నేత ఆటోలో వచ్చారు.

ఒకరేమో ఆటోలో, మరొకరేమో బస్సులో అసెంబ్లీకి.. ఎందుకో తెలుసా?

Updated On : February 8, 2024 / 12:43 PM IST

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరుగుతోన్న వేళ ఓ కాంగ్రెస్ నేత బస్సులో అక్కడకు చేరుకోగా, ఓ బీఆర్ఎస్ నేత ఆటోలో వచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయన నాంపల్లి నుంచి బస్సులోనే ప్రయాణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆటోడ్రైవర్ల ఉపాధి దెబ్బ తింటోందన్నారు. అందుకే అసెంబ్లీకి ఆటోలో వచ్చి నిరసన తెలిపానన్నారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవి తొలి బడ్జెట్ సమావేశాలు ఇవే.