MLC Kavitha : బీఆర్ఎస్ నేతలు చెరువులో చేపలాంటోళ్లు .. కాంగ్రెస్,బీజేపి నేతలు అదే చెరువులో కప్పల్లాంటోళ్లు : కవిత

దక్షిణ భారతదేశంలో ఒక చరిత్ర ఉంది,మీ ఆశీర్వాదం ఉంటే మూడవసారి అధికారంలోకి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే చరిత్ర అవుతుంది అని అన్నారు.

MLC Kavitha : బీఆర్ఎస్ నేతలు చెరువులో చేపలాంటోళ్లు .. కాంగ్రెస్,బీజేపి నేతలు అదే చెరువులో కప్పల్లాంటోళ్లు : కవిత

BRS MLC Kavitha

BRS MLC Kavitha : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సభలు, సమావేశాలతో విమర్శలు,ప్రతి విమర్శలతో హీటెక్కిస్తున్నారు. దీంట్లో భాగంగా బీఆర్ఎస్ నేత,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెట్ పల్లి మండలం బండాలింగాపూర్ లో రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు..దక్షిణ భారతదేశంలో ఒక చరిత్ర ఉంది,మీ ఆశీర్వాదం ఉంటే మూడవసారి అధికారంలోకి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే చరిత్ర అవుతుందని అన్నారు.రెండుసార్లు వేసినాం కదా మళ్లీ ఎందుకు వెయ్యాలని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు..తెలంగాణ రానప్పుడు ఎలా ఉండేది..? ఇప్పుడెలా ఉందో గమనించాలని సూచించారు.

కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో రేపే విడుదల .. ధరణి స్థానంలో కొత్త యాప్..?

బీఆర్ఎస్ నేతలు చెరువులో చేపలాంటోళ్లు అని..కాంగ్రెస్,బీజేపి పార్టీవాళ్లు అదే చెరువులో కప్పల్లాంటోళ్లు అంటూ కవిత సెటైర్లు వేశారు. తెలంగాణ వచ్చాకా ఆంద్రావాళ్లు నవ్వారని..సీఎం కేసీఆర్ వాళ్లకు బుద్ది చెప్పి తెలంగాణను అభివద్ధి చేశారని అన్నారు.రైతులకు ఎవరైన ఒక రూపాయి ఇచ్చారా..?వ్యవసాయానికి రైతుబందు ద్వారా ఆసరాగా ఉన్నామన్నారు. అలాగే రైతుల కోసం రైతు భీమా పెట్టుకున్నామని అన్నారు. పదహారు, పదిహేడు రాష్ట్రాల్లో బీడి కార్మికులు ఉన్నారు..కానీ ఏ ప్రభుత్వం కూడా వారికి పించన్ ఇవ్వలేదు..కానీ..మన తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు ఫించన్ ఇస్తున్నామన్నారు.

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్న 43మంది అభ్యర్ధులు

బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వస్తే బీడి ఫించన్ రూ.మూడువేలు అవుతుందని తెలిపారు.గ్యాస్ సిలిండర్ రూ.400లు ఉండేది. కానీ బీజేపీ పార్టీ రూ.400 సిలిండర్ ఇప్పుడు 12 వందలు చేసింది అంటూ విమర్శించారు. కానీ మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే..ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి రూ.400కే సిలిండర్ అందజేస్తామని ప్రకటించారు.బీఆర్ఎస్ పార్టీ తలకాయి తీసేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు..కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి..బీజేపి ప్రభుత్వం గెలిస్తే బీజేపీయే గెలుస్తుంది.. కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ గెలుస్తుంది..కానీ బీఆర్ఎస్ ను గెలిపిస్తే ప్రజలందరూ గెలుస్తారు అన్నారు.