MLA Rajagopal Reddy : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కేసు నమోదు

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

MLA Rajagopal Reddy : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కేసు నమోదు

Mla Rajagopal Redd

Updated On : July 27, 2021 / 10:05 PM IST

MLA Rajagopal Reddy : కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

నిన్న చౌటుప్పల్‌ పట్టణంలో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు మంత్రి జగదీష్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి వెళ్లిన రాజగోపాల్‌ రెడ్డి.. మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకొని మైక్‌ లాగేసి వాగ్వాదానికి దిగారు.

దీంతో రేషన్‌కార్డుల పంపిణీలో గొడవ చేసిన ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులపై చౌటుప్పల్‌ తహసీల్దార్‌ గిరిధర్ ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డితోపాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.