చైనా మాంజా వాడితే జైలు శిక్షే

  • Published By: chvmurthy ,Published On : January 5, 2019 / 04:12 AM IST
చైనా మాంజా వాడితే జైలు శిక్షే

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగరేసే గాలిపటాల కోసం చైనా మాంజాను ఉపయోగించినా,అమ్మినా, నిల్వ చేసినా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని  ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ప్రశాంత్ ఝూ  చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత చైనా మంజా వ్యర్దాల వల్ల పక్షులతోపాటు  మనుషులకు హాని కలుగుతోందని, గత ఏడాది ఈ మాంజా కారణంగా హైదరాబాద్ లో ఒకరు, ఢిల్లీలో మరోకరు చనిపోయారని ఆయన చెప్పారు.గ్లాస్ కోటింగ్ తో ఉన్న నైలాన్, సింధటిక్ దారం వాడటం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగితే  అందుకు కారణమైన వారికి 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష,10 వేల రూపాయల జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు.
జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 2017, జులై 11 నుంచి తెలంగాణా తో సహా దేశంలో  చైనా మాంజాను నిషేధించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోచైనా మాంజా వాడకం నిషేధానికి పోలీసు, ఇతర స్వఛ్చంద సంస్ధలు,మీడియా సహాకారం తీసుకుంటున్నామని, గడచిన 3 ఏళ్ళలో 900కిలోల నైలాన్ మాంజ స్వాధీనం చేసుకుని 123 కేసులు నమోదు చేశామని చెప్పారు.