CM KCR : రైతు బంధు దుబారా అంటున్న వారికి బుద్ది చెప్పండి : సీఎం కేసీఆర్
నేను చెప్పిన నాలుగు మాటలను ఊర్లలోకి వెళ్లి పది మందితో చర్చించండి..BRS ను బల పరచండి అంటూ పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.విచక్షణ తో ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు.

CM KCR
CM KCR at Jukkal Praja Ashirvada Sabha : తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ బాస్ కేసీఆర్ దూకుడు పెంచారు. వరుస సభలతో తనదైన శైలిలో ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దీంట్లో భాగంగా జుక్కల్ లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తు..ఎలక్షన్లు వచ్చినప్పుడు అనేక మంది వస్తారు, ఆగం ఆగం కాకుండా విచక్షణ తో ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు.గతంలో జుక్కల్ ల్లో అబ్బాయిలకు పిల్లని్వాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు..గతంలో కరెంట్ లేక నీళ్ళు లేక ఎన్నో బాధలు భరించాం..మంచి నీళ్ళ కోసం బాధ పడ్డాం, ఇప్పుడు మిషన్ భగీరథతో ఆ సమస్య లేకుండా నీళ్ళ సరఫరా చేస్తున్నామని..మంచి చెడ్డ ను చూసి ఆలోచి ఓటేయ్యండి అంటూ సూచించారు.
కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకే గజ్వేల్‌లో పోటీ : ఈటల రాజేందర్
నేను చెప్పిన నాలుగు మాటలను ఊర్లలోకి వెళ్లి పది మందితో చర్చించండి..BRS ను బల పరచండి అంటూ పిలుపునిచ్చారు.2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే మనం ఇంకా చాలా బాగా ఉండే వాళ్ళమన్నారు.మీ ఎమ్మెల్యే మంచి వాడు ఎప్పుడు నా దగ్గరకి వచ్చి వ్యక్తిగత పనులను అడగలేదు గానీ జుక్కల్ అభివృద్ది కోసం అడిగారు..మీ ఎంపీ బీబీ పాటిల్ ఎంతో శ్రద్ద తో జాతీయ రహదారులు తీసుక వచ్చాడని.. డ్రోన్ లతో మందులు సరఫరా చేశాడని తెలిపారు.మూడు రాష్ట్రాల సంగమ ప్రాంతం మీది….మహారాష్ట్ర లో పెద్ద మొత్తంలో ఆదాయం ఉన్నా..సంక్షేమం లేదు..కర్ణాటకలో కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు కానీ కేవలం ఐదు గంటల ఇస్తున్నారని అన్నారు.తెలంగాణలో అలా కాదు. 24 గంటల కరెంట్ ఇస్తున్నామని సాగు నీటికి కరెంట్ కు కొరతలేకుండా ఉన్నామని అన్నారు.
Vishnu Vardhan Reddy : ఫలించిన మంత్రి హరీశ్ రావు భేటీ .. బీఆర్ఎస్‌లోకి విష్ణువర్థన్ రెడ్డి
రైతు బంధు దుబారా అంటున్న వారికి బుద్ది చెప్పాలని ఈ సందర్బంగా గులాబీ బాస్ పిలుపునిచ్చారు. రెండు దఫాలుగా రూ.37 వేల కోట్ల రుణ మాఫీ చేసుకుని రైతులకు అండగా నిలబడ్డామని తెలిపారు. రైతు బంధు ఇవ్వకూడదని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిందని అందుకే నిలిపివేశామని ..ఎన్నికలు అవ్వగానే రైతుల అకౌంట్ల లో డబ్బులు వేస్తామని తెలిపారు. లెండి ప్రాజెక్ట్ ద్వారా అధికారంలోకి రాగానే నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చారు. నాగ మడుగు ద్వారా 40 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తామన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధింగా తెలంగాణలో దళిత బంధు పథకాన్ని BRS పార్టీ తీసుకొచ్చిందని అన్నారు.