CM KCR : కరోనాను జయించిన సీఎం కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనాను జయించారు. వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం సీఎంకు ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కరోనా పరీక్షలు నిర్వహించింది.

CM KCR : కరోనాను జయించిన సీఎం కేసీఆర్..

Cm Kcr Cured From Covid 19

Updated On : May 5, 2021 / 8:00 AM IST

CM KCR Cure from Covid-19 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనాను జయించారు. వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం సీఎంకు ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కరోనా పరీక్షలు నిర్వహించింది. ఆర్టీపీసీఆర్‌, యాంటిజెన్‌ పరీక్షలు రెండింటిలోనూ నెగెటివ్‌గా నివేదికలు వచ్చాయి. రక్త పరీక్షలు చేయగా అవి కూడా సాధారణంగా ఉన్నాయని తేలింది. సీఎం పూర్తిస్థాయిలో కోలుకున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు నిర్ధారించారు.

ఇవాళ్టి నుంచి ఆయన విధుల్లో పాల్గొనవచ్చని వైద్యబృందం సూచించింది. గత నెల 14న సీఎంకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఎర్రవల్లిలో వైద్య బృందం పర్యవేక్షణలో సీఎం కేసీఆర్‌ ఐసొలేషన్‌లో ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్‌ ఇవాళ హైదరాబాద్‌కు వచ్చే అవకాశముంది. ఆ వెంటనే ఆయన వైద్యఆరోగ్యశాఖ సమావేశం నిర్వహించనున్నారు.

ఈటల రాజేందర్‌ను ఆరోగ్యశాఖ మంత్రి పదవి నుంచి తొలగించాక సీఎం ఆ శాఖను తన పరిధిలోకి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఫోన్‌ ద్వారానే ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా కరోనా స్థితిగతులు, టీకాలు, పరీక్షలు, ఔషధాలు, కిట్లు, వైద్య సిబ్బంది తాత్కాలిక నియామకాలు, ఆక్సిజన్‌ సరఫరా, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల లభ్యత వంటి అంశాలపై ఆయన పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.