Vaman Rao couple’s murder : లాయర్ వామన్ రావు దంపతుల హత్యపై స్పందించిన సీఎం కేసీఆర్
వామన్ రావు దంపతుల హత్యపై సీఎం కేసీఆర్ స్పందించారు. వామన్ రావు దంపతుల హత్య దురదృష్ణకరమన్నారు.

Lawyer Vaman Rao Couple’s Murder
lawyer Vaman Rao couple’s murder : తెలంగాణలో లాయర్ వామన్ రావు దంపతుల హత్య ఘటన సంచలనం రేసిన విషయం తెలిసిందే. వామన్ రావు దంపతుల హత్యపై సీఎం కేసీఆర్ స్పందించారు. వామన్ రావు దంపతుల హత్య దురదృష్ణకరమన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ వామన్ రావు దంపతుల హత్య కేసులో ఎవరున్నా అరెస్టు చేయాలని ఆదేశించామని తెలిపారు.
ఈ కేసులో ఇప్పటికే ఆరుగుర్ని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. తమ పార్టీ మండల అధ్యక్షుడిని కూడా అరెస్టు చేశారని పేర్కొన్నారు. పార్టీ నుంచి తొలగించామని వాళ్లిప్పుడు జైలులో ఉన్నారని తెలిపారు.