Degree, PG, Engineering పరీక్షలు..వారికి మాత్రమే..మిగతా వారు ప్రమోట్

  • Published By: madhu ,Published On : July 17, 2020 / 09:57 AM IST
Degree, PG, Engineering పరీక్షలు..వారికి మాత్రమే..మిగతా వారు ప్రమోట్

Updated On : July 17, 2020 / 12:03 PM IST

రాష్ట్రంలో Digree, PG, Enganeering Exams విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగిలిన వారిని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా…పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు.

యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోన కారణంగా స్కూల్స్, విద్యా సంస్థలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో విద్యా వ్యవస్థ బలోపేతానికి ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్ 2020, జులై 16వ తేదీ గురువారం సమీక్ష నిర్వహించారు.

ఆగస్టు 17వ తేదీ నుంచి ఇంజినీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని సూచించారు. విద్యా సంవత్సరం కోల్పోకుండ…ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం రూపొందిస్తుందన్నారు. పాఠశాలలు ఎప్పుడు పునఃప్రారంభించాలి ? విద్యాబోధన ఎలా జరగాలి ? అనే విషయాలపై కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి..ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు చేస్తామని ప్రకటించారు. విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షలు, సిలబస్‌ తదితర విషయాలపై UGC, AIPTE వంటి సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు.

ఓ వర్క్‌షాప్‌ నిర్వహించి విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞుల అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు CM KCR.