CM KCR : బుధవారం వాసాలమర్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి వెళ్లనున్నారు.

CM KCR
CM KCR : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి వెళ్లనున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఆయన వాసాలమర్రికి చేరుకుంటారు. వాసాలమర్రిలో రైతు వేదిక భవనంలో సుమారు 130 మంది గ్రామ కమిటీ సభ్యులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. గ్రామ అభివృద్ధిపై గ్రామ కమిటీల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. రైతు వేదిక సమావేశం అనంతరం ఎస్సీ కాలనీలో కేసీఆర్ పర్యటిస్తారు. ఆతర్వాత సర్పంచ్ ఇంట్లో భోజనం చేసిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
వాసాలమర్రి గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మరో 20సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రేపు గ్రామాన్ని సందర్శించనున్నారు. ఇంతకు ముందు జూలై 9న గ్రామ పర్యటనకు సిద్ధమైనా.. వాయిదా పడింది.