Vasalamarri Village : మరోసారి వాసాలమర్రికి సీఎం కేసీఆర్!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..మరోసారి వాసాలమర్రి గ్రామానికి రానున్నారు. ఈ గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పర్యటించిన ఈయన..2021, జూలై 10వ తేదీ శనివారం ఈ గ్రామంలో పర్యటించాలని తీసుకున్నట్లు సమాచారం.

Cm Kcr Visit Vasalamarri Village On July 10th
CM KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..మరోసారి వాసాలమర్రి గ్రామానికి రానున్నారు. ఈ గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పర్యటించిన ఈయన..2021, జూలై 10వ తేదీ శనివారం ఈ గ్రామంలో పర్యటించాలని తీసుకున్నట్లు సమాచారం. అయితే.. అధికారికంగా మాత్రం ఎలాంటి షెడ్యూల్ రాకపోయినా..అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు వాసాలమర్రిలో ఏర్పాట్లపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
యాదాద్రి జిల్లా..తుర్కపల్లి మండలంలో వాసాలమర్రి గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా…గత నెల 22వ తేదీన ఇక్కడకు వచ్చారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 20 సార్లు గ్రామంలో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ గ్రామస్తులకు తెలియచేశారు. పనులకు సంబంధించి నిధులు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం దీనికి సంబంధించిన జీవోలు జారీ అయ్యాయి.
Read More : Kappa Variant : యూపీలో కొత్త రకం కరోనా..’కప్పా’ వేరియంట్ కేసులు..
కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సి ఉంటుందని..త్వరలో ఇక్కడకు వస్తానని గ్రామస్తులకు తెలియచేశారు సీఎం కేసీఆర్. శనివారం ఇక్కడకు సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత…గ్రామస్తులతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.