CM KCR : యాదాద్రికి సీఎం కేసీఆర్, 17న ప్రారంభ తేదీ ప్రకటన!

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. తుది దశకు చేరుకున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.

CM KCR : యాదాద్రికి సీఎం కేసీఆర్, 17న ప్రారంభ తేదీ ప్రకటన!

Yadadri

Updated On : September 14, 2021 / 6:58 AM IST

Yadadri Temple: తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. తుది దశకు చేరుకున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. క్షేత్రాభివృద్ధిని పరిశీలించి…మిగిలిన పనుల పూర్తి చేసేందుకు ఇంకెంత కాలం పట్టనుందో స్వయంగా అంచనా వేయనున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో యాదాద్రి ఆలయం పునఃప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు సీఎం కేసీఆర్‌. దీనికి ప్రధాని సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రపతి కోవింద్‌ను కూడా ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారు.

Read More : AP : అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ, వారు హాజరవుతారా ?

ఈ క్రమంలో ఆలయ అభివృద్ధి పనులపై మరింతగా దృష్టి కేంద్రీకరించారు సీఎం కేసీఆర్. ఇక యాదాద్రి చేరుకున్న అనంతరం ప్రధాన ఆలయంలో సూచించిన మార్పులతో పాటు మాడవీధులు, గర్భాలయం ప్రాంగణంలో అలంకరణలు, విద్యుత్‌ లైట్లు, శివాలయం విస్తరణ పనులను పరిశీలించనున్నారు. రథశాల, శ్రీవారి మెట్లు, క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్‌ పనులను పరిశీలించనున్నారు. స్వయంభువుల దర్శనానికి ముందు ….సుదర్శన మహాయాగం కోసం ఎంపిక చేసిన గండి చెరువు సమీప ప్రాంతాన్ని సీఎం పరిశీలించే అవకాశం ఉంది.

Read More : Prema Nagar : తాత సినిమాతో మనవడి మూవీకి లింక్ భలే కుదిరిందే..

నిర్మాణం పూర్తి చేసుకున్న లక్ష్మీ పుష్కరిణిలో అధికారులు ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎం సమక్షంలో మంగళవారం మరోసారి ట్రయల్ రన్‌ నిర్వహించే అవకాశాలున్నాయి. రింగ్‌ రోడ్ సుందరీకరణ పనులతో పాటు..వీవీఐపీల బస కోసం ఏర్పాటుచేస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ ప్రాంతాన్ని పరిశీలిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. యాదాద్రి ఆలయం పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా 10 శాతం పనులు చకచకా జరుగుతున్నాయి.

Read More : JioBook Laptop : జియో నుంచి మరో అద్భుతం‌.. స్పెసిఫికేషన్లు ఇవే..!

పూర్తికావొస్తున్న నిర్మాణ పనులపై వైటీడీఏ (YTDA) అధికారులను అడిగి తెలుసుకోనున్నారు సీఎం కేసీఆర్‌. తుది మెరుగులపై దిశానిర్ధేశం చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పలు నిర్మాణాలకు సంబంధించిన మార్పులు, చేపట్టాల్సిన సుందీరకరణ పనులపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఈనెల 17న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామిజీతో కలిసి మరోసారి యాదాద్రిలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. స్వామిజీ సూచనల మేరకు ఆలయ ప్రారంభ తేదీని నిర్ణయించనున్నారు ముఖ్యమంత్రి.