ORR Tenders : ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. వారిపై క్రిమినల్ కేసులు..?
20వేల కోట్లకుపైగా వచ్చే లీజు అంశాన్ని పక్కనపెట్టి కేవలం 7వేల 380 కోట్లకు అప్పనంగా కట్టబెట్టారన్నది ఆరోపణ.

ORR Tenders : ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రాపాలికి ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని సీఎం నిర్ణయించారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
హెచ్ఎండీఏ పూర్తి స్థాయి ప్రక్షాళనపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. గతంలో పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే ఔటర్ రింగ్ రోడ్ టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఆయన కోర్టుకు కూడా వెళ్లారు. 30 ఏళ్లకు 7వేల 380 కోట్లకు.. ఐఆర్ బీ ఇన్ ఫ్రాకు గత ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. అందులో 20వేల కోట్లకుపైగా చేతులు మారాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ అంశంపై పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి సుదీర్ఘ పోరాటం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి.. హెచ్ఎండీఏలో భాగంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ టెండర్లలో జరిగిన అక్రమాలు పూర్తి స్థాయిలో బయటకు రావాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలన్నారు.
సీబీఐ లేదా అదే స్థాయి సంస్థతో పూర్తిగా దర్యాఫ్తు జరిపించాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉండాల్సిన ఔటర్ రింగ్ రోడ్ ను ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం, అది కూడా నిబంధనలకు విరుద్ధంగా బినామీ కంపెనీలకు కట్టబెట్టారని నాడు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐఆర్ బీ ఇన్ ఫ్రాకు.. 30ఏళ్లకు 7వేల 380 కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్. 20వేల కోట్లకుపైగా వచ్చే లీజు అంశాన్ని పక్కనపెట్టి కేవలం 7వేల 380 కోట్లకు అప్పనంగా కట్టబెట్టారన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ. ఇప్పుడు సీఎం హోదాలో దీనిపై పూర్తి విచారణకు రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Also Read : దమ్ముంటే.. ఒక్క సీటు గెలిచి చూపించు- కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
పూర్తి వివరాలు..