Khammam: పొంగులేటి ఎపిసోడ్ తర్వాత మారుతున్న ఈక్వేషన్స్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రధాన పార్టీల ఫోకస్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. పొంగులేటి ఢిల్లీ టూర్ తర్వాత.. అన్ని ప్రధాన పార్టీల దృష్టి.. ఖమ్మం మీదకు మళ్లింది.

Congress BJP BRS focus on united khammam
Khammam- Ponguleti: బీఆర్ఎస్ అయినా.. కాంగ్రెస్ (Congress) అయినా.. బీజేపీ అయినా.. అన్ని పార్టీల ఫోకస్ ఆ జిల్లా మీదే. పొంగులేటి (ponguleti) కాంగ్రెస్ చేరడం ఖరారైపోయాక.. ఉమ్మడి ఖమ్మం జిల్లా (united khammam district)లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయ్. పొంగులేటి చెక్ పెట్టేందుకు.. అధికార బీఆర్ఎస్ (BRS Party) సరికొత్త వ్యూహాలు రచిస్తుంటే.. అక్కడ పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై బీజేపీ (BJP) దృష్టి పెట్టింది. ఇక.. పొంగులేటి చేరిన తర్వాత.. కాంగ్రెస్‌లో మూడో గ్రూప్ తయారవుతుందా? లేక.. ఇప్పటికే ఉన్న రెండు వర్గాలే ఉంటాయా? అనే చర్చ కూడా మొదలైంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. పొంగులేటి ఢిల్లీ టూర్ తర్వాత.. అన్ని ప్రధాన పార్టీల దృష్టి.. ఖమ్మం మీదకు మళ్లింది. వచ్చే నెలలోనే.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఖమ్మం జిల్లాలో బహిరంగ సభలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. జులై 2న ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించబోయే బహిరంగ సభకు.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించారు కాంగ్రెస్ నేతలు. అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలోనే.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా.. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు.. పొంగులేటి బలం కూడా తోడైతే.. మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవచ్చనే ఆలోచనతో ఉంది హస్తం నాయకత్వం. మిగతా పార్టీలతో పోలిస్తే.. ఇప్పటికే ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉంది. దాంతో.. ఈ జిల్లాపై ఎట్టి పరిస్థితుల్లో పట్టు కోల్పోకుండా.. రాబోయే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవడం మీదే కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.
Also Read: ఇక సమరమే.. తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. కర్ణాటక ఎన్నికల వ్యూహాలను అమలుచేస్తూ ముందుకు..
పొంగులేటికి చెక్ పెట్టేందుకు..
మరోవైపు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై.. అధికార పార్టీ ఫోకస్ పెంచింది. పొంగులేటికి చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో.. ఈసారి ఒకరిద్దరిని మార్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పదికి పది స్థానాలు గెలిచేందుకు.. గులాబీ దళపతి కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. జులై నెలలోనే.. ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ఇక.. పొంగులేటి పార్టీ మారినా.. ఖమ్మం జిల్లా రాజకీయాలపై ఆయన ప్రభావం ఏమీ ఉండదని మంత్రి పువ్వాడ చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read: ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా.. డీజీపీకి ఫోన్ చేసి ఆదేశాలు
పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతంపై.. బీజేపీ కూడా ఫోకస్ పెంచింది. ఇదే నెలలో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సభ నిర్వహించాల్సి ఉండగా.. తుపాను కారణంగా వాయిదా పడింది. దాంతో.. వచ్చే జులైలో.. అమిత్ షాతో భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో ఉంది కమలదళం. పొంగులేటిని బీజేపీలో చేర్చుకునేందుకు.. ఆ పార్టీ నేతలు ఎంతో ప్రయత్నించి చూశారు. చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ బృందం.. పొంగులేటి ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరిపారు. పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. కానీ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం హస్తం గూటికి చేరేందుకే మొగ్గు చూపారు. దాంతో.. ఖమ్మం జిల్లాలో బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళుతుందన్నది ఆసక్తి రేపుతోంది.