V Hanumantha Rao: నాకు రెండు సార్లు సీఎం అయ్యే అవకాశం వచ్చింది.. ప్రస్తుతం ఆ ఘనత రాహుల్ గాంధీకే దక్కుతుంది..
జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని, నరేంద్ర మోదీ ఓబీసీ ప్రధాని అయినప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు అన్నారు.

V Hanumantha Rao
TS Congress Leader: యావత్ భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా క్యాస్ట్ సెన్సెక్స్ చెస్తానని చెప్పలేదని, రాహుల్ గాంధీ మాత్రమే బీసీల గురించి మాట్లాడారని మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు అన్నారు. బుధవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ఓబీసీ ప్రధాని అయినప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 0.5శాతం ఉన్నవారే తెలంగాణలో పదవువుల్లో ఉన్నారని, నరేంద్ర మోదీ బీసీ వ్యక్తి అయిన కుడా బీసీలకు న్యాయం జరగడం లేదని వీహెచ్ అన్నారు.
No Confidence Motion: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. అవిశ్వాసంపై ఎవరెవరు ఏమన్నారంటే..?
కేంద్రంలో బీజేపీలో, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ మంత్రులకు బీసీల గురించి అడిగే దమ్ము లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ సముచిత స్థానం దక్కుతుందని వీహెచ్ అన్నారు. కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్‌కు రిక్వెస్ట్ చేస్తున్నా.. మీకేమైనా నిరాశ ఉంటే సరిచెస్తామని వీహెచ్ అన్నారు. నాకు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని వీహెచ్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యుడు తన పేరు మీద భూములని అఫిడవిట్‌లో రాయకుండానే రైతుబంధు ఎలా తీసుకున్నాడని వీహెచ్ ప్రశ్నించారు. కేసీఆర్.. నీ శాసన సభ్యుడే నీకు మోసం చేశాడని అన్నారు. మంత్రులు మీ అవినీతిని చూసుకోండి.. ప్రజలు అంతా గమనిస్తున్నారని వీహెచ్ హెచ్చరించారు. ప్రజల్లో మార్పు వచ్చింది కేసీఆర్‌కు గుణపాఠం తప్పదని వీహెచ్ అన్నారు.