10TV Exit Polls: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. 10టీవీ ఎగ్జిట్ పోల్స్‌లో ఏం తేలింది? ఎవరు గెలవనున్నారు.
కాంగ్రెస్ పార్టీకి 46-48 శాతం మధ్య ఓట్లు రావచ్చని అంచనా వేసింది.
10TV Exit Polls: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియడంతో 10టీవీ ఎగ్జిట్ పోల్స్‌ను వెలువరించింది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అకాశాలే అధికంగా ఉన్నట్లు తెలిపింది.
కాంగ్రెస్ పార్టీకి 46-48 శాతం మధ్య ఓట్లు రావచ్చని అంచనా వేసింది. బీఆర్‌ఎస్‌కు 40-42 శాతం మధ్య, బీజేపీకి 8-10 శాతం మధ్య ఓట్లు రావచ్చని తేలింది. (10TV Exit Polls)
Also Read: Bihar Exit Polls 2025: బిహార్ ఎన్నికల్లో గెలుపు ఆ కూటమిదే.. ఎగ్జిట్ పోల్స్‌లో ఏం తేలింది?
ఈ ఏడాది జూన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో కన్నుమూయడంతో ఈ ఉపఎన్నికను నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ భార్య సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు.
జూబ్లీహిల్స్‌లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ బూత్‌లు 407, పోలింగ్ కేంద్రాలు 139 ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. 58 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 10టీవీతో పాటు మిగతా సంస్థల సర్వేల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థికే అధిక శాతం ఓట్లు పడతాయని తేలింది.
పూర్తి వివరాలు
