విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్

  • Published By: bheemraj ,Published On : July 16, 2020 / 07:01 PM IST
విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్

Updated On : July 16, 2020 / 8:33 PM IST

విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముంబై జేజే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కోరేగావ్ కుట్ర కేసులో వరవరరావును ఎన్ ఐఏ అరెస్టు చేసింది. కొన్ని నెలలుగా తలోజా జైలులో రిమాండ్ ఉన్నారు. మూడు రోజుల క్రితం వరవరరావును అధికారులు ఆస్పత్రిలో చేర్చారు.

కొద్దిరోజుల నుంచి ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల ఆయనను జేజే ఆస్పత్రికి తరలించిన జైలు సిబ్బంది… త్వరలోనే ఆయనను సెయింట్ జార్జ్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆరోపిస్తున్నారు. అమానుషంగా జైలులో నిర్బంధించిందని కుటుంబసభ్యులు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాత్కాలిక బెయిల్‌ కోసం వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.