Kamareddy Court : కామారెడ్డి కోర్టులో కరోనా కలకలం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టించింది. కామారెడ్డి జిల్లా కోర్టులో కొవిడ్ లక్షణాలతో న్యాయవాది ఒకరు మృతి చెందారు.

Coronavirus Speards In Kamareddy Court
Coronavirus : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టించింది. కామారెడ్డి జిల్లా కోర్టులో కొవిడ్ లక్షణాలతో న్యాయవాది ఒకరు మృతి చెందారు. బీబీపేట మండలానికి చెందిన న్యాయవాది బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
కరోనాకు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మరణించిన తర్వాత కొవిడ్ పరీక్ష నిర్వహించగా న్యాయవాదికి పాజిటివ్‌గా తేలింది. కామారెడ్డి న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న మరో ముగ్గురికీ కూడా కొవిడ్ నిర్ధారణ అయింది. ఒక క్లర్క్, కానిస్టేబుల్, మరో న్యాయవాది ఉన్నారు.