Covid-19 Lifetime Lung Damage : కరోనా ఒకసారి వస్తే.. జీవితాంతం ఇబ్బంది పడాల్సిందే : డీఎంఈ
కరోనా ఒకసారి వస్తే.. జీవితాంతం ఇబ్బంది పడాల్సిందే అంటున్నారు హైదరాబాద్ డీఎంఈ రమేష్ రెడ్డి. వైరస్ సోకిన వ్యక్తిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిదని చెబుతున్నారు.

Covid 19 Patients May Suffer Long Term Lung Damage After Infected Once
Covid-19 Long-term Lung Damage : తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ప్రస్తుతానికి కరోనా అదుపులో ఉన్నప్పటికీ రానురాను కేసుల తీవ్రత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా విషయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా ఒకసారి వస్తే.. జీవితాంతం ఇబ్బంది పడాల్సిందే అంటున్నారు హైదరాబాద్ డీఎంఈ రమేష్ రెడ్డి.
వైరస్ సోకిన వ్యక్తిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిదని చెబుతున్నారు. లేదంటే చాలామందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని అంటున్నారయన. కరోనా సోకిన బాధిత వ్యక్తులను గత ఏడాది నుంచి పరిశీలిస్తే.. ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారని డీఎంఈ రమేష్ తెలిపారు. అందువల్ల కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్త పడటమే ఎంతో ఉత్తమమని ఆయన సూచిస్తున్నారు.
కరోనా సోకినప్పుడు స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయని అంటున్నారు. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం చేస్తుండాలి. కరోనా నుంచి కోలుకున్నాక వచ్చే సమస్యలతో ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టినట్టయితే.. జీవితాంతం ఇబ్బంది పడాల్సిందేనని చెబుతున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.