Covid Beds : తెలంగాణలో అందుబాటులో ఉన్న కోవిడ్ పడకల వివరాలు

తెలంగాణ రాష్ట్రంలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కోవిడ్ పడకల వివరాలను ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ వెబ్ సైట్ లో ఉంచింది.

Covid Beds : తెలంగాణలో అందుబాటులో ఉన్న కోవిడ్ పడకల వివరాలు

Covid Beds Availability In Telangana State

Updated On : April 23, 2021 / 1:29 PM IST

Covid Beds Availability In telangana State : కరోనా వైరస్ వ్యాప్తి తో దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కోవిడ్ పడకల వివరాలను ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ వెబ్ సైట్ లో ఉంచింది.

ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం ఎలాంటి ప్రయత్నం అయినా చేయడానికి కెసిఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం వెనుకాడదు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఫ్రభుత్వం  కోవిడ్ రోగుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

కోవిడ్ నిర్ధారణ అయ్యి సాధారణ లక్షణాలు ఉన్న వారికి హోమ్ ఐసోలేషన్ లో ఉండి కోలుకునేందుకు డాక్టర్లు సూచనలు చేసి పంపిస్తున్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు తెలంగాణాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోని కోవిడ్ పడకల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ తన వెబ్ సైట్ లో ఉంచుతోంది.

ప్రభుత్వం కోవిడ్ రోగుల కోసం సాధారణ పడకలు, వెంటిలేటర్ సదుపాయం ఉన్నపడకలు, ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకలు ఏర్పాటు చేసింది. వాటి వివరాలను గంటకు ఒకసారి అప్ డేట్ చేస్తోంది. అవసరమైన వారు ఈ క్రింది లింకు ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉన్న పడకల వివరాలను తెలుసుకోవచ్చు. ఏప్రిల్ 23 మధ్యాహ్నం ఒంటిగంటవరకు రాష్ఠ్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మొత్తం 25,805 పడకలు అందుబాటులో ఉన్నాయి.వాటిలో

ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ పడకలు 4,443
ఆక్సిజన్ సదుపాయంగల పడకలు 3,466
వెంటిలేటర్ సదపాయంగల పడకలు 990 అందుబాటులో ఉన్నాయి.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ పడకలు 10,312
ఆక్సిజన్ సదుపాయంగల పడకలు 3,833
వెంటిలేటర్ సదపాయంగల పడకలు 2,761  అందుబాటులో ఉన్నాయి.

ప్రజలు ఈ క్రింది లింకు క్లిక్ చేయటం ద్వారా రాష్ట్రంలో అందుబాటులో ఉన్నకోవిడ్ పడకల వివరాలను తెలుసుకోవచ్చును.

https://health.telangana.gov.in/

http://164.100.112.24/SpringMVC/Hospital_Beds_Statistic_Bulletin_citizen.htm