Rs Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై సీపీ సీరియస్.. నోటీసులు జారీ.. 2రోజులు డెడ్‌లైన్

FIRలు, చార్జ్‌షీట్లు, కోర్టు ఆదేశాలు వంటి ఆధారాలు సమర్పించాలని స్పష్టం చేశారు. రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటిసుల్లో పేర్కొన్నారు.

Rs Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై సీపీ సీరియస్.. నోటీసులు జారీ.. 2రోజులు డెడ్‌లైన్

Updated On : January 23, 2026 / 10:56 PM IST
  • ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై హైదరాబాద్ పోలీసులు ఆగ్రహం
  • సీపీ సజ్జనార్ పై చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో నోటీసులు
  • రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
  • క్రిమినల్, సివిల్ చర్యలు తప్పవని వార్నింగ్

 

Rs Praveen Kumar: రిటైర్డ్ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సీపీ సజ్జనార్ నోటీసులు జారీ చేశారు. సిట్ చీఫ్ గా ఉన్న తనపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తనపై ఉన్న ఏడు కేసులు ఉన్నాయంటూ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్నారు. 2 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొననారు.

శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన సందర్భంగా SIT చీఫ్‌పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, వివరాలు వెల్లడించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సిటీ పోలీసులు. SIT చీఫ్ ప్రతిష్టను దిగజార్చేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు అభిప్రాయంపడ్డారు. విచారణలో ఉన్న కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసినట్లు నోటీసులో స్పష్టం చేశారు.

SIT చీఫ్‌పై ఉన్నాయని పేర్కొన్న 7 కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఆదేశించారు. FIRలు, చార్జ్‌షీట్లు, కోర్టు ఆదేశాలు వంటి ఆధారాలు సమర్పించాలని స్పష్టంచేశారు. రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటిసుల్లో పేర్కొన్నారు హైదరాబాద్ పోలీసులు. గడువులోగా స్పందించకపోతే క్రిమినల్, సివిల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. పరువు నష్టం కేసులు, క్రిమినల్ ఇన్టిమిడేషన్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చట్ట ప్రకారం పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీసులు హెచ్చరించారు.

Also Read: కేఆర్‌కు కూడా సిట్ నోటీసులు ఇవ్వబోతోందా? గులాబీ బాస్‌ కంటే ముందు కవిత వాంగ్మూలం?

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సిట్ చీఫ్ గా ఉన్న సజ్జనార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్ పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీన్ని సీపీ సజ్జనార్ సీరియస్ గా తీసుకున్నారు. తనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయో సమర్పించాలని నోటీసులు ఇచ్చారు. ఇందుకోసం 2 రోజుల గడువు ఇచ్చారు.