కేసీఆర్‌కు కూడా సిట్ నోటీసులు ఇవ్వబోతోందా? గులాబీ బాస్‌ కంటే ముందు కవిత వాంగ్మూలం?

బీఆర్ఎస్ కీలక నేతలైన హరీశ్‌రావు, కేటీఆర్‌లను సిట్ విచారణకు పిలవడంతో ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇస్తారనే డౌట్స్ మొదలయ్యాయి.

కేసీఆర్‌కు కూడా సిట్ నోటీసులు ఇవ్వబోతోందా? గులాబీ బాస్‌ కంటే ముందు కవిత వాంగ్మూలం?

KCR, KTR, Harish Rao, Kavitha (Image Credit To Original Source)

Updated On : January 23, 2026 / 9:26 PM IST
  • నిన్న హరీశ్‌రావు.. నేడు కేటీఆర్.. నెక్స్ట్ ఎవరు?
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నెక్స్ట్ ఏం చేయబోతోంది?
  • అరెస్టుల పర్వం కూడా స్టార్ట్ కానుందా?

Phone Tapping Case: దావోస్‌లో సీఎం రేవంత్. మున్సిపల్ ఎన్నికల రివ్యూల్లో మంత్రులు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో ప్రధాన ప్రతిపక్షం. గులాబీ లీడర్లకు కౌంటర్‌లు ఇచ్చే పనిలో హస్తం పార్టీ లీడర్లు. రెండు మూడ్రోజులుగా తెలంగాణ పాలిటిక్స్‌లో మేజర్ డెవలప్‌మెంట్‌ ఇది. ఫోన్‌ ట్యాపింక్ కేసులో ముందుగా మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చి.. విచారణకు పిలిచి సెన్సేషన్‌ క్రియేట్ చేసింది సిట్‌. ఆ న్యూస్ హడావుడి కాస్త చల్లారిందో లేదో..నెక్స్ట్‌ డేనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పిలుపు వచ్చింది.

ఆయన జూబ్లీహిల్స్ పీఎస్‌కు వెళ్లి సిట్‌ విచారణ హాజరయ్యారు. అయితే మాజీ పోలీస్‌ ఆఫీసర్‌ రాధాకిషన్‌రావుతో కలిపి కేటీఆర్‌ను సిట్ విచారించడం సమ్‌ థింగ్ ఈజ్ దేర్ అన్న టాక్‌కు బలం చేకూరుస్తోంది. అయితే హరీశ్‌రావు, కేటీఆర్‌ను విచారించిన సిట్..త్వరలోనే మాజీ సీఎం, బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరై తన వెర్షన్‌ను వినిపించిన కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు ఇస్తే ఎలా రెస్పాండ్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: మళ్లీ లైన్‌లోకి విజయ సాయిరెడ్డి.. పొలిటికల్‌గా దారెటు..! ఏ పార్టీలోకి..?

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు..ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు మరికొందరు లీడర్లు, సినీ, రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారనేది కాంగ్రెస్‌ ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి సిట్‌ను వేసి విచారణ చేపిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో తమ ఫోన్ ట్యాప్ అయిందని స్టేట్‌మెంట్లు ఇచ్చిన..బండిసంజయ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో పలువురు లీడర్లను వివరాలు అడిగి తెలుసుకుంది సిట్.

కవితకు సిట్‌ నుంచి పిలుపు రానుందా?
ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేతలైన హరీశ్‌రావు, కేటీఆర్‌లను సిట్ విచారణకు పిలవడంతో ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇస్తారనే డౌట్స్ మొదలయ్యాయి. త్వరలో మాజీ సీఎం, గులాబీ బాస్‌ కేసీఆర్‌కు కూడా సిట్ నోటీసులు ఇవ్వబోతుందని ప్రచారం బయలుదేరింది. అంతలోపే మాజీ ఎమ్మెల్సీ కవితకు సిట్‌ నుంచి పిలుపు రానుందని..ఆమె వాంగ్మూలం రికార్డు చేస్తారని అంటన్నారు.

ఆమె స్టేట్‌మెంట్‌ ఆధారంగా..మిగతా అధికారులు ఇచ్చిన వివరాలను బేస్ చేసుకుని..కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి సిట్ విచారించే అవకాశం ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని శాసనమండలి ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేసిన సందర్భంగా ఇంటల్లుడి ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేస్తారా?.. కేటీఆర్ భార్య ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేస్తే ఆయన ఊరుకుండేవారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని కోరారు. సిట్ ముందు హాజరై వివరాలను అందజేస్తానని కూడా చెప్పారు. ఆమె ఈ కామెంట్లు చేసిన తర్వాతే ప్రభుత్వం సజ్జనార్ ఆధ్వర్యంలో పది మందితో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఫోన్ ట్యాపింగ్‌పై కామెంట్లు చేసినందున తగిన ఆధారాలు ఇవ్వాల్సిందిగా ఆమెకు నోటీసులు జారీచేసి ఎంక్వైరీకి పిలిచే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది.

సిట్‌పైనే బీఆర్ఎస్‌ అటాక్
మరోవైపు బీఆర్ఎస్‌ సిట్‌పైనే అటాక్ చేసింది. రాజకీయ వికృత క్రీడ కోసం రేవంత్ వ్యవస్థను దిగజారుస్తున్నారని మండిపడుతున్నారు. సజ్జనార్‌ను సిట్ చీఫ్‌గా నియమించడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సజ్జనార్‌పై 7 కేసులు ఉన్నాయి. ఆయనకు, డీజీపీ శివధర్ రెడ్డికి ఈ కేసు విచారించే నైతిక హక్కు లేదన్నారు.

లోతైన విచారణ జరిగితే సజ్జనార్‌పైనే జరగాలనే మాటను తెరపైకి తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో లేనిపోని లింకులు పెడుతున్నారని, లీడర్లకు ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని..రేవంత్ రాజకీయ క్రీడలో పోలీసులు బలికావొద్దని హెచ్చరించారు. కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు పెట్టారని హరీశ్‌ అటాక్ స్టార్ట్ చేశారు. కావాలనే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులతో సిట్ వేసి తమ మీద ప్రయోగాలు చేస్తున్నారని ఫైరవుతున్నారు.

అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తే, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అధికారులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, తప్పుడు లీకులు ఇచ్చినా ఆ పోలీసులను వదిలిపెట్టే ముచ్చటే లేదని తేల్చి చెబుతున్నారు. అంతకు అంత అనుభవిస్తారు..జాగ్రత్తగా బిహేవ్ చేయాలని సూచించారు.

రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టమని..ఎక్కడ దాక్కున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తామని హెచ్చరించారు. అయితే సిట్‌పై బీఆర్ఎస్‌ విమర్శలకు దిగడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సిట్ విచారణ తర్వాత లీకులు..మీడియాలో ఇష్టం వచ్చిన ప్రచారం జరగడంపై ఫైర్ అవుతున్నారు గులాబీ లీడర్లు. నెక్స్ట్‌ సిట్‌ నుంచి పిలుపు వచ్చేదెవరికి.? కవిత వాంగ్మూలం రికార్డు చేస్తారా లేదా.? అరెస్టుల పర్వం కూడా స్టార్ట్ కానుందా.? అనేది వేచి చూడాలి.