మళ్లీ లైన్‌లోకి విజయ సాయిరెడ్డి.. పొలిటికల్‌గా దారెటు..! ఏ పార్టీలోకి..?

చంద్రబాబును సాయిరెడ్డి టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తనను చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారన్నట్లుగా మాట్లాడారు.

మళ్లీ లైన్‌లోకి విజయ సాయిరెడ్డి.. పొలిటికల్‌గా దారెటు..! ఏ పార్టీలోకి..?

Vijay Sai Reddy (Image Credit To Original Source)

Updated On : January 23, 2026 / 8:44 PM IST
  • విజయ సాయిరెడ్డి ఓపెన్ అయిపోయారా?
  • ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ..?
  • సాయిరెడ్డి కమలం వైపు చూస్తున్నారా?
  • జగన్‌ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారా?

Vijay Sai Reddy: మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి మరోసారి..ఇన్‌ అండ్ ఔట్‌..క్లియర్‌ కట్‌ కామెంట్స్ చేసి చర్చకు దారితీశారు. ఒకప్పుడు జగన్‌కు ఆయన కుడిభుజం. ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీలో లేరు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాను వైసీపీలో నెంబర్.2 అని..ఎప్పుడైతే పవర్‌లోకి వచ్చారో..అప్పటినుంచి తనను పక్కకు పెట్టేశారని చెప్పేస్తున్నారు.

వన్స్‌ మోర్‌ అంటూ మళ్లీ పొలిటికల్ రీఎంట్రీ అంటూ ఇంట్రెస్టింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. జగన్‌ను తానెప్పుడు విమర్శించలేదని..ఆయనే తాను అమ్ముడుపోయినట్లు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేస్తున్న విజయసాయిరెడ్డి..జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఉంటే వైసీపీ అధికారంలోకి రావడం కష్టమని తేల్చేశారు. అయితే విజయసాయిరెడ్డి కామెంట్స్‌ చుట్టూ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. పదేపదే జగన్‌ కోటరీని టార్గెట్ చేస్తున్న విజయసాయిరెడ్డి..జగన్‌పై మాత్రం సీరియస్ కామెంట్స్ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది.

Also Read: మహాద్భుతం.. అరుదైన ట్రిపుల్ కన్జంక్షన్.. చంద్రుడు, శని, నెప్ట్యూన్‌ను ఒకేసారి.. 

పైగా వైసీపీ అధినేతను, ఫ్యాన్ పార్టీ క్యాడర్, లీడర్లను అలర్ట్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. కోటరీ అంటూనే ఎవరి పేర్లు తీయకుండా..వైసీపీ క్యాడర్‌కు ఓ ఇండికేషన్‌ పంపించేలా..తనపై వైసీపీ నేతల్లో, ఫ్యాన్ పార్టీ కార్యకర్తల్లో సానుభూతి పెంచుకునేలా ఆయన వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చంద్రబాబును టార్గెట్ చేస్తూ..తాను ఎవరి పక్షం కాదని చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు విజయసాయిరెడ్డి మదిలో ఏముంది.? ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఏ పార్టీలోకి.? అన్నది చర్చనీయాంశంగా మారింది.

విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. దశాబ్దన్నర రాజకీయ జీవితం ఆయనది. వైసీపీలో జగన్ తర్వాత నంబర్ టూగా ఒక వెలుగు వెలిగిన ఆయన, వైసీపీని వీడిపోతారని ఎవరూ అనుకోలేదు. కానీ అది జరిగిపోయింది. ఇక ఆయన లేటెస్ట్‌గా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన తర్వాత..మీడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు.

జగన్‌ను సేవ్‌ చేసేలా కామెంట్స్?
సేమ్‌టైమ్‌ జగన్‌ను సేవ్‌ చేసేలా కామెంట్స్ చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అదంతా పక్కన పెడితే విజయసాయిరెడ్డి చేరేది ఏ పార్టీలో అన్నదానిపై అయితే పెద్ద చర్చే నడుస్తోంది. అయితే ఆ ప్రశ్నకు సాయిరెడ్డి చెప్పిన సమాధానమే..రకరకాల చర్చలకు దారితీస్తోంది. తొందర ఎందుకు వేచి చూద్దామంటున్నారంటే సమ్‌థింగ్‌ ఈజ్ దేర్ అన్న టాక్ అయితే బయలుదేరింది.

జగన్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారా.? పవన్ పార్టీలోకి వెళ్తారా.? బీజేపీ డోర్స్‌ ఓపెన్‌ చేసి లేవా అన్నది అంతుచిక్కడం లేదు. వెయిట్ అండ్ సి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. విజయసాయిరెడ్డి అయితే కచ్చితంగా తాను రాజకీయాల్లో కంటిన్యూ అవుతాను అని చెప్పేశారు.

జగన్‌ కంటే ఆయన కోటరీపైనే గురి పెట్టారు విజయసాయిరెడ్డి. జగన్‌ చుట్టూ ఉన్న కొందరు నేతల తీరే గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కీలక కారణమని వైసీపీ నేతలే గుసగుసలు పెట్టుకుంటుంటారు. సాయిరెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడదే అస్త్రాన్ని వాడుకుని తిరిగి జగన్‌కు దగ్గరయ్యేందుకు..తిరిగి వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సాయిరెడ్డి ఆరాట పడుతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

చంద్రబాబును టార్గెట్‌ చేసిన సాయిరెడ్డి
చంద్రబాబును సాయిరెడ్డి టార్గెట్ చేయడం చర్చగా మారింది. తనను చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారన్నట్లుగా మాట్లాడారు. దాంతో ఆయన చేరే పార్టీ టీడీపీ కూడా కాదన్నది స్పష్టం అవుతోంది. జనసేనలో చేరాలనుకున్నా టీడీపీని వ్యతిరేకించే వారిని తీసుకునే చాన్స్ ఉండదని అంటున్నారు. దాంతో బీజేపీలోనే విజయసాయిరెడ్డి చేరుతారన్న టాక్ అయితే నడుస్తోంది. బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నా అది జాతీయ పార్టీ. పైగా విజయసాయిరెడ్డి కూడా ఢిల్లీ వేదికగా నేషనల్ పాలిటిక్స్‌లోనే కొనసాగాలని భావిస్తున్నారట.

దాంతో ఏపీకి సంబంధం లేకుండా ఆయన సేవలను వాడుకోవాలనుకుంటే బీజేపీ ఆయనను చేర్చుకోవచ్చు. విజయసాయిరెడ్డి కూడా బీజేపీపై సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. బీజేపీ అగ్రనేతలతో సాయిరెడ్డికి మంచి రిలేషన్స్ ఉన్నాయని చెబుతుంటారు. ఇక విజయసాయిరెడ్డి వదిలేసిన రాజ్యసభ సీటు బీజేపీ నేతకే వెళ్లడం బట్టి చూస్తే ఆయన కాషాయం కండువాను కప్పుకునే చక్రం తిప్పే రోజులు రాబోతున్నాయన్న చర్య అయితే మొదలైంది. సాయిరెడ్డి దారెటో.? ఆయన ఏ పార్టీలో చేరుతారో.? రాజకీయ పరిస్థితులే డిసైడ్ చేయాలి.