రూ.1100 కోట్ల నేరం జరిగింది, కవిత ప్రాత ఉంది- ఈడీ చార్జ్‌షీట్

లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది.

రూ.1100 కోట్ల నేరం జరిగింది, కవిత ప్రాత ఉంది- ఈడీ చార్జ్‌షీట్

Updated On : June 3, 2024 / 5:45 PM IST

Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపైన దాఖలు చేసిన చార్జ్ షీటులో ఈడీ కీలక అంశాలు ప్రస్తావించింది. కవితపై అభియోగాలు నమోదు చేసిన ఈడీ.. 1100 కోట్ల రూపాయల నేరం జరిగిందని పేర్కొంది. రూ.192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్ పొందిందని తెలిపింది. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని ఈడీ అధికారులు చెప్పారు. డిజిటల్ ఆధారాలను కవిత ధ్వంసం చేశారని తెలిపారు. రూ.292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని తెలిపింది ఈడీ.

పీఎంఎల్ఏ సెక్ష‌న్ 44, 45 కింద స‌ప్ల‌మెంట‌రీ ఛార్జ్ షీట్ ను దాఖ‌లు చేసిన ఈడీ. పీఎంఎల్ఏ సెక్ష‌న్ 17 ప్ర‌కారం తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, మ‌హారాష్ట్ర‌, పంజాబ్, హ‌ర్యానా, త‌మిళ‌నాడు ఇత‌ర ప్రాంతాల్లోని 24 స్థానాల్లో సోదాలు నిర్వ‌హించామని చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు లిక్క‌ర్ స్కాంలో 18 మందిని అరెస్ట్ చేసిన‌ట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో బెయిల్ పై ఉన్న శ‌ర‌త్ చంద్రా రెడ్డిని ఏ7గా, రాఘ‌వ మాగుంటను ఏ18గా, ఏ 32గా కవిత పేరును ఈడీ పేర్కొంది. మొత్తం 49 మందిని ఈడీ అధికారులు విచారించారు. పీఎంఎల్ ఏ సెక్ష‌న్ 50(2), (3) ప్ర‌కారం.. క‌విత‌, మాగుంట శ్రీనివాసులు, రాఘవ మాగుంట‌, గోపి కుమ‌ర‌న్, శ‌ర‌త్ చంద్రా రెడ్డి, స‌మీర్ మ‌హేంద్రు, దినేశ్ అరోరా, అరుణ్ పిళ్లై, వి. శ్రీనివాస్ ఇత‌రుల వాంగ్మూలాల రికార్డు చేసినట్లు ఈడీ తెలిపింది.

మరోవైపు లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. జూన్ 7వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. అదే రోజున సీబీఐ చార్జ్ షీటు దాఖలు చేయనుంది.

Also Read : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని అదృశ్యం