Pawan Kalyan : తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. కొండగట్టు పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత తెలంగాణ జనసేన పార్టీ నేతలతో పవన్ భేటీ అవుతారని సమాచారం.

Pawan Kalyan : తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం నుంచి ఉదయం రోడ్డు మార్గం ద్వారా పవన్ కొండగట్టుకు బయలుదేరారు. పవన్ వెంట భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు తరలివెళ్లారు. హైదరాబాద్ శివారు నుంచి పవన్ కల్యాణ్ కు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూలు చల్లుతూ స్వాగతం చెప్పారు. తుర్కపల్లి వద్దకు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పవన్ అక్కడ కొద్దిసేపు ఆగారు. పవన్ ను గజమాలతో సన్మానించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులకు, జనసేన పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ అభివాదం చేశారు.

Also Read : CM Chandra babu : పింఛ‌న్‌దారుల‌కు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ.. కీలక విషయాలు వెల్లడి

పవన్ కల్యాణ్ కొండగట్టు ఆలయంలో సుమారు గంటలపాటు ఉండనున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, తోపులాటలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్తున్నక్రమంలో తెలంగాణలోని బీజేపీ కార్యకర్తలుసైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ బీజేపీ కార్యకర్తలు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయని పవన్ పేర్కొన్నారు. జై జనసేన జై బీజేపీ జై తెలంగాణ అంటూ పవన్ కల్యాణ్ నినాదాలు చేయడం గమనార్హం.

Also Read : వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశారా? పోలవరం శ్వేతపత్రంతో చంద్రబాబు అనుకున్నది సాధించారా?

పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. కొండగట్టు పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత తెలంగాణ జనసేన పార్టీ నేతలతో పవన్ భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుంది. ఇటీవల ఎంపీ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావాలని బీజేపీ అధిష్టానం ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ సైతం తెలంగాణలో జనసేన బలోపేతం దృష్టిసారిస్తే.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమన్న వాదనను జనసేన పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.