Double Bedroom Houses : డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభం.. న‌ల్లా నీళ్లు తాగిన కేటీఆర్

ఖ‌మ్మం జిల్లాలో డ‌బుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం జరిగింది. ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌ను ప‌రిశీలిస్తున్న కేటీఆర్..

Double Bedroom Houses : డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభం.. న‌ల్లా నీళ్లు తాగిన కేటీఆర్

Double Bedroom Houses Ktr

Updated On : April 2, 2021 / 6:51 PM IST

Double Bedroom Houses : ఖ‌మ్మం జిల్లాలో డ‌బుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం జరిగింది. ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌ను ప‌రిశీలిస్తున్న కేటీఆర్.. ఓ ఇంటిలోని న‌ల్లాను తానే స్వ‌యంగా ఆన్ చేసి నీళ్ల‌ను తాగారు. రాష్ర్టంలోని ప్ర‌తి నివాస స‌ముదాయానికి మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు అందుతున్నాయి.

ఖ‌మ్మం అర్బ‌న్ మండ‌లం టేకుల‌ప‌ల్లిలో రూ. 60.20 కోట్ల‌తో నిర్మించిన 1,004 డ‌బుల్ బెడ్రూం ఇళ్లను మంత్రులు కేటీఆర్, ప్ర‌శాంత్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ క‌లిసి ప్రారంభించారు. టేకులపల్లిలో డబుల్‌బెడ్‌రూం గృహ లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ సెంటర్లను, ప్రాథమిక ఉప కూరగాయల మార్కెట్‌ను మంత్రులు సందర్శించి వాటిని ప్రారంభించారు.