MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత కారుని తనిఖీ చేసిన ఎన్నికల కమిషన్ అధికారులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉండగా ఈ తనిఖీలు జరిగాయి.

MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత కారుని తనిఖీ చేసిన ఎన్నికల కమిషన్ అధికారులు

MLC Kavitha

Updated On : November 7, 2023 / 1:07 PM IST

MLC Kavitha : ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అనుసరించి జరిగిన ఈ తనిఖీలకు కవిత సహకరించారు.

Rashmika : రష్మిక మార్ఫింగ్ వీడియో పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్..

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారును నిలిపివేసిన ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.  కారు నుంచి బయటకు దిగిన కవిత తనిఖీలు జరిగినంత సేపు అధికారులకు సహకరించారు.

MLC Kavitha : చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్.. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ గురించి కూడా..

ఎన్నికల కోడ్‌ను అనుసరించి అధికారులు నిర్వహించిన తనిఖీలో కవిత సహకరించినందుకు వారు కృతజ్ఞతలు చెప్పారు. తనిఖీల అనంతరం కవిత తన పర్యటన కొనసాగించారు.