Huzurabad Politics : టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు..ఈటల బావమరిది చాటింగ్ దుమారం
టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు నిర్వహించడం కొంత ఉద్రిక్తతలకు దారి తీసింది. దళిత సంఘాలకు చెందిన నేతలు, ఈటల జమున పోటాపోటీగా ధర్నాలు నిర్వహించారు.

Huzurabad
Etala Rajender : హుజారాబాద్ లో పాలిటిక్స్ హీటెక్కాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ…రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. త్వరలోనే జరిగే ఉప ఎన్నికలో పాగా వేసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ లు వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగా..బీజేపీ నేత ఈటల పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..2021, జూలై 29వ తేదీ గురువారం టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు నిర్వహించడం కొంత ఉద్రిక్తతలకు దారి తీసింది. దళిత సంఘాలకు చెందిన నేతలు, ఈటల జమున పోటాపోటీగా ధర్నాలు నిర్వహించారు.
Read More : Corona Cases : దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. సగానికి పైగా కేసులు కేరళ నుంచే
ఈటల బావమరిది : –
దీనికంతటికి కారణం..ఈటల బావమరిది మధుసూధన్ రెడ్డి చేసిన చాటింగ్. ఈ చాటింగ్ దుమారం రేపుతోంది. చాటింగ్ లో తమ కులాన్ని కించపరిచారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చాటింగ్ లో బీజేపీలో ఉన్న కీలక నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై అనుచిత వ్యాఖ్యలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదంతా జమున సోదరుడు మధుసూధన్ రెడ్డి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే..ఈ చాటింగ్ అంతా ఫేక్ అంటోంది టీఆర్ఎస్ వర్గం.
Read More : US Earthquake : అలాస్కాలో 8.2 తీవ్రతతో భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ
ధర్నా, రాస్తారోకోలు : –
స్థానికంగా ఉన్న అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకోలు నిర్వహించాయి. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ అసత్య ప్రచారం నిర్వహిస్తోందని మండిపడ్డారు ఈటల జమున. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టాయి. నిన్న రాత్రి ఈటెల బావమరిది మధుసూధన్ రెడ్డి చాటింగ్ చేసినట్లు కొన్ని స్ర్కీన్ షాట్స్ బయటకు వచ్చాయి. దళితులను కించపరిచినట్లు, బీజేపీలో ఉన్న కీలక నేతలకు సంబంధించిన కొన్ని విషయాలు అందులో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
ఫేక్ చాట్ అంటున్న ఈటల జమున : –
దీంతో గురువారం ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఎన్నికైన బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దళిత సంఘాలు రోడ్డు మీదకు వచ్చాయి. ఈటల రాజేందర్, మధుసూధన్ శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. ఈ ఛాటింగ్ పై ఈటల వర్గం ధీటుగా స్పందించింది. తన సోదరుడు మధుసూధన్ నిర్వహించలేదని, ఫేక్ చాట్ అంటూ ఈటల సతీమణి జమున వెల్లడించారు.
Read More : Sonu Sood : హెయిర్ కటింగ్‌పై సోనూసూద్ మెళకువలు!
పోలీసులకు ఈటల పీఏ కంప్లైట్ : –
టీఆర్ఎస్ వాళ్లే తయారు చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. దళితులను తమపైకి ఉసిగొల్పే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో…ఈటల పీఏ నరేష్ రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. తనను ఉద్దేశ్యపూర్వకంగా ఇందులోకి లాగినట్లు, టీఆర్ఎస్ కారణమంటూ వెల్లడించారు. మరి వాట్సాప్ చాట్ నిజమా ? కాదా ? అనేది తేలాల్సి ఉంది.