Etela Rajender : హరీష్‌రావుపై విరుచుకు పడ్డ ఈటల రాజేందర్

ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన నియోజక వర్గంలోని వారికి హరీష్ రావు దావత్ కు డబ్బులు ఇచ్చి మెప్పు పొందాలని చూస్తున్నారని మాజీమంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.

Etela Rajender : హరీష్‌రావుపై విరుచుకు పడ్డ ఈటల రాజేందర్

Eatala Rajender

Updated On : July 7, 2021 / 2:32 PM IST

Etela Rajender : ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన నియోజక వర్గంలోని వారికి హరీష్ రావు దావత్ కు డబ్బులు ఇచ్చి మెప్పు పొందాలని చూస్తున్నారని మాజీమంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. టీఆర్ఎస్‌లో  హరీష్‌రావుకు తనకు పట్టిన గతే పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. డబ్బు ప్రలోభాలను పాతరేసే సత్తా హుజురాబాద్ ప్రజలకుందని ఆయన చెప్పారు.

కొందరు మంత్రులు ఎమ్మెల్యేలతో తనపై అవాకులు చెవాకులు మాట్లాడిస్తున్నారని ఈటల అన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని విమర్శించారు. తాను వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు తనపై కేసీఆర్ కుట్రలు చేశారని ఈటల ఆరోపించారు. వారి అబద్ధాల పత్రిక ఛానల్‌లో పదేపదే చూపించారని అన్నారు.

ఆ వార్తలు చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ కన్నీరు పెట్టారని ఈటల పేర్కోన్నారు. తమతో తిరిగే యువకుల్ని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని… అందరినీ బెదిరించి టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుతున్నారని ఈటల ఆరోపించారు.