Ex DSP Nalini: ‘భౌతిక ప్రపంచం నుంచి బయటపడ్డాను.. ఇప్పుడు నేను’.. రేవంత్ రెడ్డిని కలిశాక మాజీ డీఎస్పీ నళిని ఏమన్నారో తెలుసా?
నాలా ఎవరూ బాధపడవద్దన్నదే నా అభిప్రాయం.. అంటూ 10 టీవీకి నళిని పలు వివరాలు తెలిపారు.

Ex DSP Nalini meets CM Revanth Reddy
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 12 ఏళ్ల క్రితం రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళిని ఇవాళ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రేవంత్ రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులు ఏంటని గతంలో అధికారులను రేవంత్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, నళిని మాత్రం తిరిగి ఉద్యోగంలో చేరేందుకు సుముఖంగా లేరు.
రేవంత్ రెడ్డిని కలిశాక 10 టీవీతో నళిని మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు ఉద్యోగం అవసరం లేదు. డబ్బు, భౌతిక ప్రపంచం నుంచి బయట పడ్డాను… ఇప్పుడు నాది ఆధ్యాత్మిక మార్గం. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను.. సీఎం సానుకూలంగా స్పందించారు.
త్వరలోనే వేదం, యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నా. సనాతన ధర్మ ప్రచారానికి పనిచేస్తా.. గతంలో నేను, తోటి ఉద్యోగులు.. డిపార్ట్మెంట్‌లో ఎదుర్కొన్న సమస్యలపై సీఎంకు రిపోర్ట్ ఇచ్చాను. నాలా ఎవరూ బాధపడవద్దన్నదే నా అభిప్రాయం.
నాడు బ్యురొక్రసి మీద నమ్మకం పోయింది… అందుకే ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నా.. నాకు జరిగిన అన్ని విషయాలు.. సీఎం దృష్టికి తీసుకెళ్లాను. నా మనసుకు నచ్చిన సేవ చేస్తున్నాను. ఇన్నాళ్ల నా మనొవ్యధను ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉంది. సీఎం రేవంత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని చెప్పారు.
Tamilisai Soundararajan: ‘రాజీనామా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ’ ప్రచారంపై గవర్నర్ తమిళిసై స్పందన