Ktr: మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదని సీఎం రేవంత్ చెప్పగలరా? కేటీఆర్
ఈ ఫోన్ ట్యాపింగ్ బక్వాస్ కేసు. ఇందులో ఏమీ లేదు. పోలీసులకు కూడా ఆ విషయం తెలుసు.
Ktr Representative Image (Image Credit To Original Source)
- ఫోన్ ట్యాపింగ్ తో మాకేం సంబంధం?
- ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వాలు చేయవు, పోలీసులు చేస్తారు
- నా ఫోన్ ట్యాప్ అవుతుందో లేదో సిట్ ను అడుగుతా
Ktr: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు. ట్యాపింగ్ అనేది రొటీన్ గా జరిగే కార్యక్రమం అన్నారాయన. పోలీసులు చూసుకునే వ్యవహారం మంత్రులకు సంబంధం లేదన్నారు. ఏ సమాచారం ఎలా వచ్చిందనేది మంత్రులు, సీఎం అడగరు అని వివరించారు.
”మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. రేవంత్ ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? శాంతి భద్రతలు, ప్రభుత్వాల స్థిరత్వం కోసం 1952 నుంచి ట్యాపింగ్ చేస్తుంటారు. రేపు సిట్ కి కూడా నేను ఇదే చెబుతా. అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీని, ఇప్పటి డీజీపీని సిట్ ఎందుకు పిలవదు. సిట్ అధికారులు టైమ్ పాస్ చేస్తున్నారు. వారి విచారణ కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లా ఉంది. సీఎం రేవంత్ దావోస్ వెళ్లిన 10 రోజులు టైమ్ పాస్ చేయడానికే ఈ డ్రామా. ఈ ఫోన్ ట్యాపింగ్ బక్వాస్ కేసు. ఇందులో ఏమీ లేదు. పోలీసులకు కూడా ఆ విషయం తెలుసు. హరీశ్ ను అడిగిందే అడిగారు. నన్ను కూడా అడిగిందే అడుగుతారు. సిట్ ఆఫీసుకి బరాబర్ వెళ్తా. చెప్పి వస్తా. ఫోన్ ట్యాపింగ్ అవుతుందో లేదో చెప్పమని అడుగుతా. రేవంత్ ప్రభుత్వాన్ని డిప్యూటీ కూలుస్తారా? నల్లగొండ బాంబు కూలుస్తుందో తెలీదు” అని కేటీఆర్ అన్నారు.
”బొగ్గు స్కామ్ బయటపెట్టినందుకే హరీశ్ కి నోటీసులు. రేవంత్ కు పాలన రాదు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే సిట్ నోటీసులు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే డైవర్షన్ పాలిటిక్స్. ఫోన్ ట్యాపింగ్ తో మాకేం సంబంధం? ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వాలు చేయవు, పోలీసులు చేస్తారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఫోన్లపై పోలీసులు నిఘా. నా ఫోన్ ట్యాప్ అవుతుందో లేదో సిట్ ను అడుగుతా. ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని ఇప్పుడున్న అధికారులు చెప్పగలరా? తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు కాంగ్రెస్ మంత్రులే చెబుతున్నారు. రేవంత్ కు పాలన చేతకాక రోజుకో డ్రామా ఆడుతున్నారు. మంత్రులు, వారి కుటుంబసభ్యుల దందాలపై సిట్ వేయాలి. భూ స్కామ్ లు, బొగ్గు కుంభకోణాలపై సిట్ ఎందుకు వేయరు? ఫోన్ ట్యాపింగ్ కేసులో బలయ్యేది పోలీసులే” అని కేటీఆర్ అన్నారు.
Also Read: పురపోరు వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో రోజుకొక చోట చిచ్చు
