KTR: కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడానికి వాళ్లే కారణం.. రేవంత్ సొంత మామే.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బీఆర్ఎస్ కి మంచి పేరు వస్తుందని ఏదో చేసి ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఆస్తి కాదు.

KTR: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడానికి కాంగ్రెస్ వాళ్లే కారణం అని తన అనుమానం అన్నారు కేటీఆర్. అధికారంలోకి రావడానికి కాంగ్రెసోళ్లు ఏదో చేసి ఉంటారని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో వరి ధాన్యం సాగులో పంజాబ్, హర్యానాను పక్కకు నెట్టి దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు కేటీఆర్.
”కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం ఖర్చే 80 వేల కోట్లు అని సీఎం రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డే అంటున్నారు. లక్ష కోట్ల కుంభకోణం అనేది రాజకీయంగా బక్వాస్ మాట అని రేవంత్ రెడ్డి సొంత మామే చెబుతున్నారు. మరి లక్ష కోట్ల కుంభకోణం ఎక్కడి నుంచి జరిగిందో సీఎం రేవంత్ రెడ్డే చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బీఆర్ఎస్ కి మంచి పేరు వస్తుందని ఏదో చేసి ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఆస్తి కాదు.
Also Read: సీఎం రమేష్ vs కేటీఆర్ ఇష్యూపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. నీ భాష మార్చుకో అంటూ వార్నింగ్..
నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నినాదం. కానీ ఈరోజు నీళ్లు చంద్రబాబుకు పోతున్నాయి. నిధులు ఢిల్లీలోని రాహుల్ గాంధీకి పోతున్నాయి. నియామకాలేమో చంద్రబాబు తొత్తులకు పోతున్నాయి. కొట్లాడకపోతే కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణిని కూడా ప్రైవేట్ పరం చేస్తాయి. మళ్లీ తెగించి కొట్లాడాల్సిందే, తలబడాల్సింది కేసీఆర్ దళమే తప్ప ఇంకెవరూ కాదు” అని కేటీఆర్ అన్నారు.