బీఆర్‌ఎస్‌కు షాక్‌.. పార్టీకి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా

ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు.

బీఆర్‌ఎస్‌కు షాక్‌.. పార్టీకి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా

Updated On : August 4, 2025 / 6:25 PM IST

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు. బీఆర్‌ఎస్‌ తీరు వల్ల అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు, బాలరాజు బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది.

Also Read: టెస్ట్‌ క్రికెట్ చరిత్రలో అత్యల్ప పరుగులతో విజయం.. గతంలో ఒక్క పరుగుతో గెలిచిన 2 జట్లు ఉన్నాయ్‌.. ఫుల్ డీటెయిల్స్‌

గువ్వల బాలరాజుతో పాటు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు బీజేపీ రాష్ట్ర నేతలతో వారు భేటీ అయ్యారు. ఈ నెల 10 లేదా 11వ తేదీన బీజేపీ చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడతున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం కూడా ఆ పార్టీలో కాక రేపుతోంది.